- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగను దొరికించడంలో స్మార్ట్ వీడియో డోర్ బెల్ దిట్ట..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతన్న సంఘటనలు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినా, సీసీ కెమెరాలు అమర్చినా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఏ విధంగా దొంగతనాలు ఆపాలన్నా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చోరీలను ఆపడానికి మార్కెట్లో వివిధ రకాల సెక్యూరిటీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటే స్మార్ట్ వీడియో డోర్ బెల్. దీన్ని మీ డోర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కెమెరాలో, వీడియో రికార్డింగ్, రెండు వైపులా ఆడియో - వీడియో కాల్, హెచ్చరికలు జారీ చేయడం వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్ వీడియో డోర్ బెల్ దొంగతనం, ఇతర నేరాల నుండి మీ ఇంటిని, కార్యాలయాలని రక్షిస్తుంది.
స్మార్ట్ వీడియో డోర్ బెల్ : ఫీచర్లు
వీడియో రికార్డింగ్ : స్మార్ట్ వీడియో డోర్ బెల్ ముందుకు ఎవరైనా వస్తే వారి వీడియోను రికార్డ్ చేయగలదు.
టూ-సైడ్ ఆడియో-వీడియో కాల్ : స్మార్ట్ వీడియో డోర్ బెల్ ద్వారా, మీరు మీ డోర్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తితో ఆడియో కాల్ లేదా వీడియో కాల్ మాట్లాడవచ్చు.
హెచ్చరికలు : స్మార్ట్ వీడియో డోర్ బెల్ ద్వారా మీ ఇంటి వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు మీకు సిగ్నల్స్ ను పంపగలదు. మీ ఇంట్లో, కార్యాలయంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది.
ముఖ గుర్తింపు : కొన్ని స్మార్ట్ వీడియో డోర్‌బెల్స్ ముఖాలను గుర్తించగలవు. మీ ఇంటి వద్దకు ఎవరు వచ్చారో కనుగొనడంలో ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది.
చీకటిలో వీడియో రికార్డింగ్ : కొన్ని స్మార్ట్ వీడియో డోర్‌బెల్స్ చీకటిలో కూడా బాగా పని చేస్తాయి. ఇవి మీకు స్పష్టమైన వీడియోలను అందిస్తాయి. ఈ ఫీచర్ ద్వారా మీరు తలుపు వద్దకు వచ్చే వ్యక్తిని సులభంగా చూడవచ్చు.