Unknown Facts : ఈ అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుందని తెలుసా ?

by Prasanna |   ( Updated:2022-12-12 08:22:06.0  )
Unknown Facts : ఈ అలవాట్ల  వల్ల  మీ ఆరోగ్యం చెడిపోతుందని తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : సిగరేట్ తాగడం , మందు తాగడం లాంటివి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మన అందరికి తెలుసు. అయినా వాటిని ఎవరు మానరు. కాబట్టి వీటి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. కానీ ఇవి కాకుండా మనం రోజు చేసే పనుల్లో కూడా కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తాయి. కానీ వీటి గురించి చాలామందికి తెలియక వీటిని రోజు చేస్తు ఉంటారు. అంత ఎందుకు నేను చెప్పబోయే పాయింట్స్ మీరు కూడా చేసేవే.

తుమ్మును ఆపుకోవడం

ఒక్కోసారి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు గాని , బాస్ ఎదురుగా ఉన్నప్పుడు కానీ తుమ్ము వస్తున్నప్పుడు కొంత మంది ఆపుకుంటారు. ఇది చాలా చిన్న విష్యం కావచ్చు. కానీ దీని వల్ల చాలా ప్రమాదం ఉంది. తుమ్ము అనేది ఒక పవర్ఫుల్ లాంటిది. ఈ సమయంలో గంటకు 160 కిమీ వేగంతో గాలి బయటకు వస్తుంది. అటువంటప్పుడు..వీరు ముక్కు నోరు మూసేసి తుమ్మును ఆపితే అది చెవుల్లోకి ప్రవహించి కర్ణ భేరి దెబ్బ తింటుంది. దీనితో వినికిడి శక్తి లోపిస్తుంది.

నిద్రకు ముందు ఫోన్ వాడటం

ఇలా నిద్రకు ముందు చీకట్లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల కంటి కింద ముడతలు రావడం , నిద్ర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అసలు నిద్రకు ముందు మొబైల్ ఫోన్ వాడటమే మంచిది కాదు. కానీ తప్పని సరి ఐనప్పుడు చీకట్లో కాకుండా గదిలో లైట్స్ ఆన్ చేసి వాడండి. అలాగే కొన్ని బ్రైట్నెస్‌ను తగ్గించే నైట్ మోడ్ అనే కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కంటి మీద లైటింగ్ ఎఫెక్ట్‌ను తగ్గించుకోవచ్చు.

డేటా వినియోగంలో టాప్ 2.. మోగుతున్న డేంజర్ బెల్స్

Advertisement

Next Story

Most Viewed