Weight loss : బరువు తగ్గుతున్నామని సంబురం వద్దు! ఆ విషయంలో అనుమానించాల్సిందే!

by Javid Pasha |
Weight loss : బరువు తగ్గుతున్నామని సంబురం వద్దు! ఆ విషయంలో అనుమానించాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : అధిక బరువు.. ఇటీవల అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో ఇదొకటి. డబ్ల్యుహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం 250 మిలియన్లకు పైగా ప్రజలు దీనిబారిన పడుతున్నారు. అయితే దీంతోపాటు అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా ప్రమాదకరం కావచ్చు అంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గడం మంచి విషయమే కానీ.. చాలా వేగంగా, అనుకోకుండా గనుక మీ శరీరంలో అలాంటి మార్పులు గమనిస్తే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరు నెంచి 14 నెలల కాలంల మీరు 5 కిలల వరకు బరువు తగ్గారంటే అది అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ఇది పలు వ్యాధులకు సంకేతం కావచ్చు. అవేంటో చూద్దాం.

*హైపోథైరాయిడిజం : థైరాయిడ్ అధికం అవడం అనేది జీవక్రియను నియంత్రిస్తుంది. అయితే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఆ పనిని మరింత వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. తత్ఫలితంగా బరువు తగ్గుతారు. అనుకోకుండా ఇలా జరుగుతుంటే యాంటిథైరాయిడ్ డ్రగ్స్, బీటా బ్లాకర్స్ అండ్ రేడియోయోడిన్ థెరపీతో చికిత్సతో దీనికి పరిష్కారం లభిస్తుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. తరచుగా వాపునకు దారితీస్తుంది. ఫలితంగా జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గేలా ప్రేరేపిస్తుంది. అయితే ఆర్థరైటిస్‌కు ఎటువంటి నివారణ లేనప్పటికీ వాపు, నొప్పి వంటివి మేనేజ్ చేయడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. అందుకోసం కార్టికోస్టెరాయిడ్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.

*టైప్ 1 డయాబెటిస్ : చాలామంది టైప్ 1 డయాబెటిస్ వల్ల వేగంగా బరువు తగ్గుతుంటారు. కొందరు తాము ఈ వ్యాధికి గురయ్యామని గుర్తించకముందు ఇలా జరగడంవల్ల స్లిమ్ అవుతున్నామని అనుకునే చాన్స్ ఉంటుంది. కానీ తర్వాత ఇబ్బంది పడతారు. టైప్ 1 బాధితుల ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ మేకింగ్ సెల్స్ రోగనిరోధక వ్యవస్థ ద్వారా దాడి చేయబడటంవల్ల ఇలా బరువు తగ్గుతారు. అలాగే శరీరం ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేయకపోతే, అది గ్లూకోజ్‌ను ఇంధనంగా (fuel) ఉపయోగించవచ్చు. ఇటువంటప్పుడు కూడా కండరాల క్షీణత, బరువు తగ్గడం సమస్యలు తలెత్తతాయి. స్ట్రిక్ట్ డైట్ మెయింటెన్ చేయడం, అలాగే ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవడం (షాట్స్ లేదా ఇన్సులిన్ పంప్ ద్వారా) ఈ పరిస్థితిని మేనేజ్ చేయడానికి ఉన్న ఏకైక మార్గం.

*ప్రేగు వ్యాధి, డిప్రెషన్, టీబీ : మానసిక ఆరోగ్య సమస్యలు అనుకోకుండా బరువు తగ్గడానికి కారణం కావచ్చు. డిప్రెషన్ వంటి మూడ్ డిజార్డర్స్ ఆకలిని ప్రభావితం చేస్తాయి. (both increase and loss) ఊహించని విధంగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే సైకో థెరపీ అండ్ మెడికేషన్స్, యాంటిడిప్రెసెంట్స్ వంటి మందుల ద్వారా నిపుణులు చికిత్స అందిస్తారు. దీంతోపాటు ఇంఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (ప్రేగు వ్యాధి) కూడా కేలరీలను బర్న్ చేస్తుంది. ప్రేగు వ్యాధి ఆకలి హార్మోన్ అయితే గ్రెలిన్, సంతృప్తిని సూచించే హార్మోన్ అయిన లెప్టిన్‌కు కూడా అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల వెయిట్‌లాస్ జరగవచ్చు. సాధారణంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్, అమినోసాలిసైలేట్స్, ఇమ్యునో మోడ్యులేటర్స్ అండ్ కార్టికో స్టెరాయిడ్స్‌తో ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇక క్షయవ్యాధి లేదా ట్యూబర్ కొలోసిస్ (TB) కూడా ఆకలి, బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఊహించని విధంగా బరువు తగ్గడం కొన్నిసార్లు క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు. ఇవన్నీ ఒకరి రోజువారీ కేలరీల వ్యయాన్ని పెంచడం ద్వారా బరువు తగ్గేందుకు కారణం అవుతాయి.

*గుండె పనితీరులో మార్పు : గుండెకు తగినంత రక్తాన్ని పంపింగ్ చేయడంలో శరీరం, గుండె వైఫల్యం చెందినప్పుడు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థకు తగినంత రక్తం లభించకపోతే కూడా ఆకలి తగ్గుతుంది. ఆహారంపై విరక్తి, వికారం వంటి లక్షణాలు సంభవించవచ్చు. అందుకే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ శ్వాసను మరింత కష్టతరం చేస్తుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి శరీరానికి ఎక్కువ కేలరీలు అవసరం అవడం కారణంగా బరువు తగ్గుతారు. జీవన శైలిలో మార్పులు, హెల్తీ డైట్ వంటివి గుండెకు సక్రమంగా రక్తం సరఫరా అవడంలో సహాయపడతాయి. కాబట్టి శరీరంలో అనుకోని మార్పులు సంభవిస్తుంటే.. ముఖ్యంగా ఎటువంటి వ్యాయామం, డైట్ మెయింటెన్ లేకుండా బరువు తగ్గుతుంటే తప్పక అనుమానించాలి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed