థైరాయిడ్ కారణంగా బరువు తగ్గలేకపోతున్నారా?.. ఈ టెక్నిక్ పాటిస్తే చాలు!

by Javid Pasha |
థైరాయిడ్ కారణంగా బరువు తగ్గలేకపోతున్నారా?.. ఈ టెక్నిక్ పాటిస్తే చాలు!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడంవల్ల అధిక బరువు, సంతానలేమి వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అయితే ఇటీవల చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వెయిట్‌లాస్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోందని చెప్తుంటారు. అలాంటివారు ప్రత్యేక డైట్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తవానికి థైరాయిడ్ గ్రంథి నార్మల్ కంటే ఎక్కువ లేదా చాలా తక్కువ హార్మోన్‌ను ప్రొడ్యూస్ చేయడాన్ని థైరాయిడ్ వ్యాధిగా పేర్కొంటారు. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అధిక బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల ఇతర అనారోగ్యాలు కూడా సంభవించే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ బాధితులు అధిక బరువు అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.

చక్కెరకు దూరంగా..

అధిక చక్కెర స్థాయిలు గల పదార్థాలు తింటే థైరాయిడ్ సమస్య మరింత అధికం అవుతుంది. అలాగే బరువు కూడా పెరుగుతారు. కాబట్టి కొద్ది మొత్తంలో తినడం లేదా తినకపోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. కొందరు ఆహారాన్ని తినేటప్పుడు ఒకేసారి ఫుల్లుగా తింటుంటారు. థైరాయిడ్ ఉన్నవారికి ఇది మంచిది కాదు. రోజులో 4 నుంచి 5 సార్లు తిన్నా పర్లేదు కానీ, ఆహారం తీసుకున్న ప్రతిసారీ మితంగా తినాలి. ఇంకొంచె తింటే బాగుండు అనే ఫీలింగ్ ఉండగానే భోజనం ఆపివేయాలి. అవసరం అయితే మళ్లీ కొన్ని గంటల తర్వాత తినవచ్చు.

వ్యాయామం - నీరు

థైరాయిడ్ బాధితుకు వ్యాయామాలు చాలా ముఖ్యం. రకరకాల వర్కవుట్స్ చేయకపోయినా కనీసం ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే థైరాయిడ్ ఉన్నవారు వేగంగా బరువు పెరుగుతారు. ఊబకాయం పెరుగుతుంది. కాబట్టి ఉదయం, సాయంత్రం నడక మంచిది. అట్లనే థైరాయిడ్ బాధితులు రోజంతా హైడ్రేట్‌గా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని తగినంత నీరు తాగాలి. జీర్ణక్రియకు ఇది చాలా ముఖ్యం. అధిక బరువు పెరగకుండా ఉండాలంటే జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలి.

ప్రోటీన్లు తీసుకోవడం ముఖ్యం

నిజానికి థైరాయిడ్ వ్యాధి హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. కాబట్టి తగిన ప్రోటీన్లు గల ఆహారాలు తీసుకోవడంవల్ల ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. తాజా కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే అన్ని రకాల పండ్లు, కూరగాయలు తినడంవల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed