- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వలింగ సంపర్కం చేస్తే చనిపోవడమేనా..?
దిశ, ఫీచర్స్: స్వలింగ సంపర్కం నేరమా? ట్రాన్స్‌జెండర్‌గా మారడం పాపమా? క్వీర్ కమ్యూనిటీగా ప్రకటించుకుంటే దోషమా? బైసెక్సువల్ అయితే తప్పేంటి? అంటే.. ముమ్మాటికీ నేరమే అంటోంది ఉంగాడా పార్లమెంట్. LGBTQగా గుర్తించబడితే మరణశిక్ష, జీవిత ఖైదుతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ‘స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టం’ను ఆమోదించింది.
కాగా ఈ నిబంధనలు ప్రపంచంలోని అత్యంత క్రూరమైన స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టాలలో ఒకటిగా నిలిచాయి. దేశంలోని క్వీర్ పీపుల్‌ను సామాజికంగా వెలివేసేందుకు దారితీస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ చట్టం అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఆమోదం పొందాల్సి ఉండగా.. ఈ చట్టం సరిగ్గా ఏం చెప్తుంది? ఎవరిని శిక్షిస్తుంది? దీన్ని తిరోగమనంగా ఎందుకు ఆరోపిస్తున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
కిల్ ది గేస్ బిల్..
స్వలింగ సంపర్క వ్యతిరేక బిల్లు - 2023.. ఉగాండా పార్లమెంట్ డిసెంబర్ 2013లో ఆమోదించిన చట్టానికి మరింత తిరోగమన రూపం. ఫిబ్రవరి 2014లో ప్రెసిడెంట్ ముసెవెనీచే చట్టంగా సంతకం చేయబడిన స్వలింగ సంపర్క నిరోధక బిల్లు.. ‘కిల్ ది గేస్ బిల్లు’గా పరిగణించబడుతుంది. ఇది స్వలింగ సంబంధాలలో నిమగ్నమయ్యే వ్యక్తులకు మరణశిక్షను కూడా ప్రతిపాదించింది. అయితే ఈ శిక్షను తరువాత జీవిత ఖైదుగా సవరించారు.
కానీ అదే సంవత్సరం ఆగస్టులో ఉగాండా రాజ్యాంగ న్యాయస్థానం విధానపరమైన కారణాలపై చట్టం చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఉగాండా పార్లమెంట్ వెబ్‌సైట్ ప్రకారం.. ‘ప్రస్తుత యాంటీ-హోమోసెక్సువాలిటీ బిల్ గే సెక్స్ ఉగాండా సాంప్రదాయ మరియు మతపరమైన విలువలకు ముప్పు కలిగిస్తుందని నమ్ముతుంది. అందుకే శిక్షించబడే స్వలింగ ప్రవర్తన పరిధిని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తుంది’.
చట్టం ప్రకారం శిక్షించదగినది ఏమిటి?
2023 స్వలింగ సంపర్క నిరోధక బిల్లు ‘తీవ్రమైన స్వలింగ సంపర్కం’ నిబంధనను ప్రవేశపెడుతోంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులతో, వైకల్యం కలిగిన వ్యక్తులతో స్వలింగ సంబంధాలు కలిగి ఉన్న వరుస నేరస్తులకు, HIV పాజిటివ్ ఉన్న వారికి మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చింది. అంటే లైంగిక కార్యకలాపాలకు వికలాంగులు సమ్మతించకూడదని కూడా దీని అర్థం. అంతేకాకుండా బిల్లు స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించడాన్ని చట్టవిరుద్ధం చేస్తుంది. LGBTQ సమస్యలపై పూర్తి సెన్సార్‌షిప్ సిస్టమ్‌ను క్రియేట్ చేస్తుంది. LGBTQ హక్కుల కోసం వాదించే లేదా అటువంటి సంస్థలకు ఆర్థిక సహాయం అందించే వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనుంది. పిల్లలను స్వలింగ సంపర్క కార్యకలాపాలలో నిమగ్నం చేసే ఉద్దేశ్యంతో అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి జీవిత ఖైదును ఎదుర్కొంటాడు.
స్వలింగ సంపర్క చర్యలలో పాల్గొన్నట్లు అనుమానం వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే.. వారికి మద్దతిస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. స్వలింగ వివాహ వేడుకను నిర్వహించడం లేదా స్వలింగ ప్రవర్తనను సులభతరం చేసే వసతి కల్పించడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఉల్లంఘించినవారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. స్వలింగ సంపర్క చర్యలకు లేదా ఏదైనా ఇతర లైంగిక మైనారిటీ హక్కుల కార్యకలాపాలకు తమ ప్రాంగణాన్ని బ్రోతల్ హౌజ్‌గా ఉపయోగించినట్లయితే .. దానికి సంబంధించిన యజమానులు కూడా జైలు పాలయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.
కార్యకర్తలు ఎందుకు అలారం పెంచుతున్నారు?
పార్లమెంటులోని దాదాపు 389 మంది సభ్యులందరూ ఈ చట్టానికి మద్దతు ఇచ్చారు. ‘మా సృష్టికర్త దేవుడు ఇక్కడ ఏం జరుగుతుందో సంతోషంగా ఉన్నాడు. మా పిల్లల భవిష్యత్తును రక్షించే బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. మేము ఆమోదించిన ఈ బిల్లు ప్రజలకు భరోసా ఇస్తుంది. మేము ఇది జనం కోసం చేస్తున్నాం. కొంతమంది వ్యక్తుల కోసం కాదు’ అని తెలిపారు. అయితే కొత్త చట్టం భౌతిక మరియు ఆన్‌లైన్ దాడులు, ఏకపక్ష అరెస్టులు, తప్పుడు నేరారోపణలతో పాటు LGBTQ వ్యక్తులపై వేటను ప్రేరేపిస్తుందని.. వివక్ష, ద్వేషం, పక్షపాతాన్ని సంస్థాగతం చేస్తుందని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన ఆశ్రయం, ఆరోగ్యం, విద్య, ఆహారం వంటి ప్రాథమిక సామాజిక సేవలను వారికి అందకుండా చేస్తుంది. ట్రెడిషనల్ వాల్యూస్ పేరుతో మరిన్ని సంప్రదాయవాద చట్టాలకు తలుపులు తెరుస్తుంది.
Also Read...
లవర్స్ బ్రేకప్ కోసం.. బడ్జెట్‌లో రూ. 33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం