- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending : డెస్టినేషన్ వెడ్డింగ్.. నచ్చిన ప్రాంతంలో అందరూ మెచ్చేలా..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు పెళ్లిళ్లు చాలా వరకు ఇంటివద్దే జరిగేవి. పచ్చటి పందిళ్లు, బంధువులతో మండపాలు కళకళలాడేవి. అయితే ఇటీవల చాలా మంది ‘డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్’ను అనుసరిస్తున్నారు. బిజీ సిటీ లైఫ్‌కు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో వివాహ వేడుకలను జరుపుకోవాలని భావిస్తున్నారు. దంపతుల స్వస్థలం లేదా నివాసం వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో లేదా దేశాల్లోని రిసార్టుల్లో, హోటల్స్‌లో, ఫంక్షన్ హాల్స్‌లో పెళ్లి వేడుక జరపడాన్నే డెస్టినేషన్ వెడ్డింగ్ (destination wedding) అంటున్నారు. అయితే హ్యాపీగా జరిగిపోవాలంటే అందుకోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ ప్లాన్ ఇలా..
సాధారణంగా డెస్టినేషన్ వివాహాలకు ఖర్చు ఎక్కువ. కాబట్టి మీ బడ్జెట్‌కు తగిన ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలా కాకుండా అప్పులు చేసి మరీ ఘనంగా చేయాలనుకుంటే తర్వాత సమస్యల్లో కూరుకుపోతారు. ఈ తరహా పెళ్లిలో సాధారణ ఖర్చులతోపాటు ట్యాక్స్‌లు, సర్వీస్ చార్జీలు, ఈవెంట్ ఆర్గనైజర్లకు చెల్లింపులు వంటివి చాలానే ఉంటాయి. కాబట్టి ఎంచుకునే అందమైన లొకేషన్‌తో పాటు బడ్జెట్ నిర్వహణపై (Budget management) ఫోకస్ చేయాలంటున్నారు నిపుణులు. అనుకోకుండా చివరి నిమిషంలో కాస్త ఖర్చు ఎక్కువైనా పెట్టుకోవడానికి రెడీగా ఉండేలా సిద్ధపడాలి.
తేదీ, సమయం, లొకేషన్
ముందుగా మీరు లొకేషన్ వెతుక్కుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహణ ఈజీ అవుతుంది. అందమైన బీచ్‌లు, ఎత్తైన పర్వాతాలు, టూరిస్టు ప్రాంతాలు, లోయలు, పచ్చిక బయళ్లు గల ప్రాంతాలు.. ఇలా లొకేషన్ ఏదైనా మీ బడ్జెట్‌కు, ఆసక్తికి సరిపడా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ డెస్టినేషన్ బడ్జెట్ (Destination budget) మీకు సరిపడకపోతే అదే తరహా అనుభూతిని కలిగించే మరో ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లొకేషన్, యాక్సెసిబిలిటీ, కంఫర్టబుల్, లోకల్ ఫెసిలిటీస్ వంటివి పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ప్లానర్‌ను నియమించుకోండి
డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బడ్జెట్ నిర్ణయించుకోవడమే కాదు, పెళ్లి వేడుకను సక్రమంగా నిర్వహించేందుకు ఓ ప్లానర్ అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు వెళ్లబోయే ప్రాంతంలోని వేదికలు, సర్వీసుల గురించి లోకల్ ప్లానర్లకు అయితేనే బాగా తెలుస్తుంది. వాళ్లే అన్నీ మేనేజ్ చేయడంవల్ల మీపై ఒత్తిడి తగ్గుతుంది.
స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు
అసలే కొత్త ప్రదేశంలో పెళ్లి చేసుకుంటారు కాబట్టి అక్కడి విషయాలపట్ల ముందే అవగాహనకు రావాలి. విదేశాల్లో ప్లాన్ చేస్తుంటే గనుక అక్కడి ఆచార వ్యవహారాలు, లీగల్ ఇష్యూస్, రూల్స్, రిక్వైర్ మెంట్స్ వంటివి తెలుసుకొని ఆచరించాలి. కాగా కొన్ని ప్రదేశాలకు ట్రాన్స్‌లేటెడ్ డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతుంటాయి. అలాంటి విషయాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలాగే ముందుగానే మీ వెడ్డింగ్ ప్లాన్‌తో కలిసి వివాహ వేదికను సందర్శించండి. మీకు తగినట్లుగా ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఇండోర్, అవుట్ డోర్ ఈవెంట్స్
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటేనే ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో కూడా వివాహ వేడుక ఇండోర్‌గా (Indoor) ఉండాలో, ఔట్ డోర్(outdoor)గా చేయాలో ముందుగానే నిర్ణయించుకోండి. ముఖ్యంగా వర్షకాలమైతే గనుక ఇండోర్ ఈవెంట్స్, మిగతా సీజన్లలో అవుట్ డోర్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అట్లనే మీరు నివాసం ఉండే హోటల్ లేదా రిసార్టుకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీని ఎంచుకోండి. ట్రావెల్ సౌకర్యాలను ముందుగానే బుక్ చేసుకోండి.
అతిథులు - వసతులు
వెడ్డింగ్ ఈవెంట్‌లో వసతులు కల్పించడం, అతిథులకు సౌకర్యంగా (Convenience of guests) ఉండేలా చూసుకోవడం ముఖ్యం. కాబట్టి మ్యూజిక్ రిస్ట్రిక్షన్స్, ఆల్కహాల్ పాలసీల గురించి ముందే తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ ఈవెంట్‌ను ఎంజాయ్ చేసేలా తగిన ప్రణాళిక అవసరం. అలాగే వీడియోగ్రాఫర్, ఫొటో గ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్ వంటి వారిని ముందుగానే బుక్ చేసుకోవడం, ఫుడ్ మెనూ డిసైడ్ చేసుకోవడం మీకు మేలు చేస్తుంది.
Read More ...
Trending : డెస్టినేషన్ వెడ్డింగ్.. నచ్చిన ప్రాంతంలో అందరూ మెచ్చేలా..