- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొన్ని ప్రాంతాల్లో 2 రెట్లు అధికంగా CO2ను రిలీజ్ చేస్తున్న చెట్లు.. మానవాళికి ముప్పు పొంచి ఉందా?
దిశ, ఫీచర్స్ : మొక్కలు, చెట్లు పగటి పూట కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. ఇందంతా కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా జరుగుతుంది. అవి తమ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సూర్యుడి నుంచి శక్తిని ఉపయోగించుకుంటాయి. అలాగే ఆక్సిజన్‌ను తయారు చేయడానికి గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను, నేల నుంచి నీటిని యూజ్ చేసుకుంటాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కానీ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం మాత్రం కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. వేడివాతావరణం, నీటి కొరత ఉన్నప్రాంతాల్లోని చెట్లు రెండు రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్‌ను రిలీజ్ చేస్తాయని వారు చెప్తున్నారు.
ఎలా గుర్తించారు?
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు కార్బన్ డయాక్సైడ్ విడుదల గురించిన విషయాలు తెలుసుకోవడానికి ‘మొక్కల కణాలలో కార్బన్ డయాక్సైడ్ పరిస్థితులను కొలిచే గ్లోబల్ డేటాసెట్ ఎనలైజింగ్’ ప్రాసెస్‌ను అనుసరించారు. ఇది వెచ్చని వాతావరణ సందర్భాల్లో చెట్లలో ఫోటోరెస్పిరేషన్ రేటు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా నీరు పరిమితంగా ఉన్నప్పుడల్లా అలా జరుగుతుందని రీసెర్చర్స్ గ్రహించారు. భూమి యొక్క ఊపిరితిత్తులుగా పరిగణించబడే చెట్లు వేడివాతావరణంలో ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ (CO2)ను విడుదల చేస్తాయనేది ప్రస్తుతం పలు సందేహాలను లేవనెత్తుతోంది.
వాతావరణంపై ప్రతికూల ప్రభావం
చెట్ల నుంచి కార్బన్ డయాక్సైడ్ అధిక విడుదల అనేది వాతావరణంపై ఏమైనా ప్రభావితం కలిగిస్తుందా? అనే కోణంలో పరిశోధకులు ఆలోచిస్తున్నారు. ఈ ఊహించని పరిణామం చెట్లు క్లైమేట్ చేంజ్ వారియర్స్‌గా ప్రబలంగా ఉంటాయనే భావనను సవాలు చేస్తోందని అంటున్నారు. ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన కొత్త చిక్కుల గురించి ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రతికూల వాతావరణ మార్పులను తగ్గించడానికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం. ఎందుకంటే ఇది గ్లోబల్ వార్మింగ్‌కు దోహదపడే ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువు. ప్రస్తుతం మొక్కలు మానవ-ఉద్గార CO2లో 25 శాతం గ్రహిస్తాయి. ఇది కీలకమైన కార్బన్ సింక్‌గా పనిచేస్తుంది. కానీ వేడి లేదా వెచ్చన వాతావరణంలో చెట్లు రెండు రెట్లు అధికంగా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేయడం అనేది గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న క్రమంలో మానవాళికి గ్లోబల్ వార్మింగ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలకు సంకేతంగా నిపుణులు పేర్కొంటున్నారు.