- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాన్ వెజ్‌ను తెగ లాగించేస్తోన్న టాప్-10 రాష్ట్రాలివే.. తెలంగాణకు ఎన్నో స్థానమంటే?

దిశ, వెబ్ డెస్క్: నాన్ వెజ్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే నాన్ వెజ్. సందర్భం ఏదైనా 'ముక్క లేనిదే ముద్ద దిగదు' అనేది తెలంగాణ వాసుల నానుడీ. కానీ, మన దేశంలో మాంసాహారాన్ని ఎక్కువగా తినే టాప్-10 రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు, ఈ నాన్ వెజ్ లవర్స్ విషయంలో ఏపీ కూడా తెలంగాణను బీట్ చేసింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే(NHFS-5) దేశంలో నాన్ వెజ్ తినడంలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలను ప్రకటించింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఈ సర్వే ప్రకారం.. ఇండియాలో అత్యధికంగా మాంసాహారం తినే రాష్ట్రం నాగాలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో 99.8% మంది ప్రజలు నాన్ వెజ్ తింటారని పేర్కొంది. అనంతరం 99.3 శాతం నాన్ వెజ్ లవర్స్‌తో పశ్చిమ బెంగాల్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక్కడి జనం ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. 99.1 శాతంతో కేరళ మూడో స్థానాన్ని ఆక్రమించుకుంది. కేరళీయులు సీఫుడ్స్ అధికంగా వినియోగిస్తారు. ఇక నాలుగో స్థానాన్ని ఏపీ దక్కించుకుంది. ఇక్కడ చికెన్, మటన్ ఫుల్లుగా లాగించే వారు 98.25 శాతం మంది ఉన్నారు. ఐదో స్థానంలో 97.65శాతంతో తమిళనాడు ఉండగా, ఆరో స్థానంలో 97.35 శాతంతో ఒడిశా ఉంది. ఇక్కడి వారు రోయ్యలు ఎక్కవ ఇష్టపడతారు. 7వ స్థానంలో ఉన్న తెలంగాణలో 97.3 శాతం మంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు. ఇక్కడ మటన్, చికెన్, ఫిష్ తినేవాళ్ల సంఖ్య ఎక్కువ. 97 శాతంతో 8వ స్థానంలో 97 శాతంలో జార్ఖండ్, త్రిపుర 95, గోవా 93.8తో చివరి స్థానంలో ఉంది.
గత ఏడాది టాప్ ప్లేస్ లో నిలిచిన తెలంగాణ
గతేడాది కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో మాంసాహారాన్ని ఎక్కువ తింటున్న రాష్ట్రాల్లో తెలంగాణ 99 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో మాంసం ధరలు భారీగా పెరగటం, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులతో నాణ్యతలేని ఆహార పదార్థాలు బయటపడటంతో నాన్ వెజ్ తినటం తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
నాన్‌వెజ్ తినడం వల్ల కలిగే లాభాలు
మాంసాహారం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. శరీరానికి అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్‌ను అందించటంతో నాన్ వెజ్ ఎంతో తోడ్పడుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, నిర్వహణకు మంచిది. అలాగే మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. అలాగే నాన్ వెజ్‌లో ఉండే B12 విటమిన్ నరాల పనితీరు మెరుగుపరచడంలో సాయపడుతుంది.
నాన్‌వెజ్ తింటే కలిగే నష్టాలు
నాన్ వెజ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అధికంగా తింటే హాని కూడా కలిగిస్తుంది. మాంసాహారంలో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియాతో కలుషితమై అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్ వెజ్ తినేప్పుడు దొరికిందల్లా తినేయకుండా ఆరోగ్యమైన మాంసాన్ని తినండి.