- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు ఎంపికయ్యారా లేదా అని తెలియాలంటే ఇలా చెక్ చేసుకోండి.!
దిశ, ఫీచర్స్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 6 గ్యారెంటీలో 500 కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అనేది ఇస్తూ ఉండగా. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై ఒక భారీ పథకాన్ని అయితే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ మీకు అందుబాటులో ఉన్నదో లేదో అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
తెల్ల రేషన్ కార్డు కలిగిన LPG గ్యాస్ వినియోగదారులకు 500 కే గ్యాస్ ఇస్తాము అని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధికారికంగా మొదలవుతుంది. కానీ ఈ పథకంలో నేరుగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తూ ఉండగా, డెలివరీ టైం లో మాత్రం పూర్తి మొత్తాన్ని తీసుకొని 500కు పైగా చెల్లించిన మొత్తాన్ని అర్హులకు సబ్సిడీగా అందజేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ మీ ఖాతాలో ఉన్నదో లేదో ఎలా చూసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. కొంత మందికి బ్యాంకుల నుండి ఎస్ఎంఎస్(SMS) వస్తున్న అసలు సబ్సిడీ వస్తుందో రాదో అనే విషయం పై మరికొందరు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇలాంటి టెన్షన్లు ఏమి లేకుండా సబ్సిడీ సొమ్ము మీ ఖాతాలో ఉన్నదో లేదో ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చు. సబ్సిడీ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా www.mylpg.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి.. లాగిన్ ఆప్షన్ దగ్గర లాగిన్ అయ్యి ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వగానే వెబ్ పేజీ పై భాగాన గ్యాస్ ఫోటోలు చూపుతుంది. అప్పుడు మీ సిలిండర్ ఏ కంపెనీకి చెందిందో ఆ కంపెనీని క్లిక్ చేసి ఎంచుకోవాలి. (EX: మీరు భారత్ గ్యాస్, HP గ్యాస్, ఇండియన్ గ్యాస్‌లో మీది ఏ గ్యాస్ అయితే అది ఎంచుకోవాలి.) దాని తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ పై క్లిక్ చేస్తే మీ సిలిండర్‌కి సబ్సిడీ ఉందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీ పేరు కూడా నమోదు అయినట్లుగా ఉంటే మీకు సబ్సిడీ లభిస్తున్నట్లు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800233355 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.