వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌తో అలసిపోతున్నారా.. ఈ ఫుడ్‌తో ఎనర్జీగా ఉండండి!

by Jakkula Samataha |
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌తో అలసిపోతున్నారా.. ఈ ఫుడ్‌తో ఎనర్జీగా ఉండండి!
X

దిశ, ఫీచర్స్ : కరోనా కలవరంతో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్‌కే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ చేస్తూనే ఉంటున్నారు. అయితే ఇలా ఇంట్లో కూర్చొని గంటల కొద్దీ పనిచేయడం వలన చాలా మంది మెంటల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారంట.ఇంట్లో ఉండి జాబ్ చేయడం తర్వాత వంట పని, ఇంటి పని చేసుకోవడంతో చాలా మంది మహిళలు స్ట్రెస్‌కు గురవుతున్నారంట. అంతేకాకుండా ఎనర్జీ లెవల్స్ తగ్గిపోయి, వారు అనారోగ్య సమస్యల భారినపడాల్సి వస్తుంది.అందువలన వారు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సమయంలో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన తక్షణ శక్తి మాత్రమే కాకుండా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవి :

వేయించిన శనగలు : వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువలన డ్యూటీ చేసే వారు రోజూ శనగలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

పిస్తా పప్పులు : పిస్తా పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తూనే, ఆకలిని నియంత్రిస్తాయి. అందువలన వర్క్ ఫ్రమ్ హోం చేసేవారు డైలీ పిస్తా పప్పులు తీసుకోవడం వలన తక్షణ శక్తి లభిస్తుందంట.

ఫ్రూట్స్ : వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు, ఆపిల్, అరటి , ధానిమ్మ, బొప్పాయా లాంటి పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవాలంట. దీని వలన అనారోగ్య సమస్యలు ధరి చేరకుండా ఉంటాయంట.

Advertisement

Next Story

Most Viewed