పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. ఈ టిప్స్ పాటిస్తే విజయం మీదే?

by Hamsa |
పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. ఈ టిప్స్ పాటిస్తే విజయం మీదే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు పరీక్షలంటే భయపడుతుంటారు. ఫస్ట్ క్లాస్ రావాలనే ఆలోచనతో నెల ముందుగానే బుక్స్ పట్టుకుని టెన్షన్ పడుతూ చదువుతుంటారు. కొంత మంది పరీక్షలకు భయపడి కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవాలని తిండి నిద్రాహారాలు మానేసి చదువుతారు. అయితే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ టిప్స్ పాటించి చదివితే కచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయి.

* ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు 8 గంటలపాటు నిద్రపోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండి ఎక్కువ సేపు చదువుకోగలుగుతారు.

* అలాగే పరీక్షలకు ముందే ఒక టైమ్ టేబుల్‌ను తయారుచేసుకోవడం మంచిది.

*పరీక్షల సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి.

* కొంత సమయం చదివిన తర్వాత బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే చిరాకుగా ఉండి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.

*చదివిన దానిని మర్చిపోకుండా ఉండాలంటే దానిని మళ్లీ రివిజన్ చేసుకుంటే పరీక్షలకు గుర్తుంటుంది.

Advertisement

Next Story

Most Viewed