30 ఏండ్లు దాటిన పురుషుల శరీరంలో ఆ మార్పులు.. కారణం ఇదే..

by Javid Pasha |
30 ఏండ్లు దాటిన పురుషుల శరీరంలో ఆ మార్పులు.. కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : కాలం నిరంతర ప్రవాహం లాంటిది. మనుషుల వయస్సు కూడా అంతే.. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా మనల్ని దాటుకుంటూ పోతుంది. అందుకే కాలం, జీవితం పరస్పర అనుబంధమని, నిర్లక్ష్యం చేయక సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. గడిచిన కాలం తిరిగి రానట్లే.. గడిచిన వయస్సు కూడా తిరిగి రాదు. వయస్సుతో పాటు శరీరంలో పలు మార్పులు జరుగుతుంటాయి. అయితే ముప్పై ఏండ్ల తర్వాత పురుషుల శరీరంలో ఏం జరుగుతుందో, ఆనందంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోటీన్లు - రోగ నిరోధక శక్తి

మూడు పదులు దాటిన తర్వాత మగవారిలో సహజంగానే కొన్ని శారీరక మార్పులు, ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి కూడా ప్రతికూల, సానుకూల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వయస్సు పెరుగుదలతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో భాగంగా అవసరం అయిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తప్పక ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

కండరాల్లో మార్పు - విటమిన్ల లోపం

ముప్పై ఏండ్ల తర్వాత పురుషులందరిలోనూ టెస్టో స్టెరాన్ లెవల్స్ తగ్గుతుంటాయి. ఇవి కండరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలా జరగకుండా ఉండటానికి, సమస్య నుంచి బయటపడటానికి విటమిన్ డి ఉన్న ఫుడ్ చాలా ముఖ్యం. దీనిని తరచుగా తీసుకోవడంవల్ల టెస్టో స్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఎముకలకు కాల్షియం అందిందిచడంవల్ల బలంగా మారుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. క్యాన్సర్లు, వివిధ స్కిన్ అలెర్జీలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా విటమిన్ డి రిలేటెడ్ ఫుడ్స్ సహాయపడతాయి.

ఆందోళన.. అసలు కారణం

బాల్యం, యుక్త వయస్సులో ఉన్న ఫిట్‌నెస్, ఉత్సాహం 30 ఏండ్ల తర్వాత కనిపించదు. ముఖ్యంగా విటమిన్ కె లోపం ఇందుకు కారణం. శరీరంలో ఇది లోపించినప్పుడు మానసిక ఆందోళన పెరగుతుంది. కాబట్టి ఇటువంటి మార్పును గమనించినప్పుడు, సమస్య నుంచి బయటపడటానికి కె. విటమిన్ భర్తీ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో హెల్తీ డైట్ మెయింటెన్ చేయాలి. మరో విషయం ఏంటంటే.. చాలామందికి 30 ఏండ్ల తర్వాత ప్రోస్టేట్ హెల్త్‌ ఇష్యూస్ వస్తుంటాయి. చాలా వరకు విటమిన్ ఏ లోపంవల్ల ఇలా జరగుతుంది. నివారణ కోసం క్యారెట్లు, చిలగడ దుంపలు, మిల్క్ ప్రొడక్ట్స్ వంటి విటమిన్ ఏ లభించే ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి.

నాడీ వ్యవస్థపై ప్రభావం

ముప్పై ఏండ్లు దాటిన పురుషుల్లో నాడీ సమస్యలు రావచ్చు. విటమిన్ 12 లోపం ఇందుకు ప్రధాన కారణం. మొక్కలు, జంతు ఆధారిత ఆహారాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల మాంసాహారం, చేపలు, గుడ్లు, మొక్కల ద్వారా లభించే పప్పులు, నట్స్ వంటివి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు, ఒత్తిడి, డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. శరీరంలో మెగ్నీషియం లోపంవల్ల ఇలా జరుగుతుంది. లోపం లేకపోయినా వచ్చాయంటే వంశపారంపర్య సమస్యలు కావచ్చు. మెగ్నీషియం లోపిస్తే గుండె కండరాలు బలహీన పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బచ్చలి కూర, చిక్కుళ్లు, తృణ ధాన్యాలు, ఇతర ఆకుకూరల్లో ఇది లభిస్తుంది. కాబట్టి ఈ ఆహారాల ద్వారా తీసుకోవడం ద్వారా, అలాగే తగిన శారీక శ్రమ కలిగి ఉండటంవల్ల శరీరంలో ప్రతికూల మార్పులను అడ్డుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed