Poisonous Plant: నవ్వుతో చంపేస్తున్న మొక్క..

by Sujitha Rachapalli |
Poisonous Plant: నవ్వుతో చంపేస్తున్న మొక్క..
X

దిశ, ఫీచర్స్ : పెరటిలో వెల్లుల్లి మొక్క మాదిరిగా కనిపించే హెమ్లక్ వాటర్ డ్రాప్ వార్ట్ ప్లాంట్ అత్యంత విషపూరితమైనదని చెప్తున్నారు నిపుణులు. మొక్క ఆకు, పువ్వు, కాండంతో సహా అణువణువు పాయిజన్ తో నిండి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ ప్లాంట్ కు సంబంధించిన ఒక్క ఆకు తిన్నా మరణం తథ్యమని.. ఇలా చనిపోయిన వాళ్ల ముఖాలపై పెద్ద నవ్వు ఉంటుందని చెప్తున్నారు.

ఇక ఈ మొక్క క్యారెట్ జాతికి చెందినది. కాగా యూరప్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో.. తడి గడ్డి భూములు, తడి అడవులు, నది, ప్రవాహాల ఒడ్డున పెరుగుతుంది. దీన్ని ముట్టుకుంటే ఏమీ కానప్పటికీ దద్దుర్లు, మంట కలిగిస్తుంది. మానవులతోపాటు జంతువులకు కూడా విషాన్ని కలిగిస్తుంది. మొక్కలోని విషపూరిత సూత్రం ఓనాంథోటాక్సిన్.. ఒక పాలీఅన్‌శాచురేటెడ్ హై ఆల్కహాల్. కాగా ఇది శక్తివంతమైన మూర్ఛ, మెదడులోని γ-అమినోబ్యూట్రిక్ యాసిడ్ (GABA) వ్యవస్థను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. పశువులలో లాలాజలం పెరగడం, కనుగుడ్లు విస్తరించడం, శ్వాసకోశ బాధలు, ఇతర మూర్ఛలు వంటి లక్షణాలు కలగొచ్చు.

Advertisement

Next Story

Most Viewed