- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ జైలు చాలా స్పెషల్ గురూ..!
దిశ, ఫీచర్స్: బొలీవియాలో ఉన్న అతి పెద్ద జైలు శాన్ పెడ్రో. సాధారణంగా జైలు అంటే ఖైదీలు, కాపల గార్డులు ఉంటారు. కానీ, ఈ జైలులో మాత్రం గార్డ్‌లు ఉండరట. ఖైదీల కౌన్సిల్స్ మాత్రమే ఉంటారు. వారే కఠిన శిక్షలను విధిస్తారు. ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలు ఉంటారు. అయితే, ఈ జైలులులో ఖైదీలకు కఠిన శిక్షలతో పాటుగా కొన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. అవేంటంటే..ఇక్కడి ఖైదీలు ఎవరి సెల్‌ని వారే కొనుక్కోవాలి లేదా అద్దెకు తీసుకోవాలి. జైలులోకి వెళ్లిన తరువాత జైలు మేయర్ లేదా ఫ్రీలాన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ల ద్వారా సెల్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఒకవేళ గది దొరకకపోతే అక్కడి చలి వల్ల చనిపోయినా ఆశ్చర్యం లేదట.
అంతేకాకుండా ఈ జైలులో మార్కెట్ స్టాల్స్, క్యాంటీన్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఉన్నాయి. ఇది చూడడానికి ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. అక్కడ నేరానికి తగ్గట్లుగా శిక్షలు విధిస్తారు. ఈ జైలులో స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. దానిని ఉపయోగించి ఖైదీలకు ఉరి శిక్షను వేస్తారట. మరొక విషయం ఏంటంటే.. నేరస్తుడికి ఉరి వేస్తున్న సమయంలో మిగితా ఖైదీలు అందరూ సంగీతం ప్లే చేస్తారట.