Kids: చిన్న పిల్లలకు నీళ్లు ఈ విధంగా పట్టండి!

by Prasanna |   ( Updated:2023-06-05 09:53:53.0  )
Kids: చిన్న పిల్లలకు నీళ్లు ఈ విధంగా పట్టండి!
X

దిశ, వెబ్ డెస్క్:వేసవి కాలంలో చిన్న పిల్లలను బాగా చూసుకోవాలి. ఎందుకంటే సాధారణ మనుషులే ఎండ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఇంక చిన్న పిల్లలు అంత వేడిని ఎలా తట్టుకోగలరు? కాబట్టి వారికీ ఏదోకటి నీళ్ల రూపంలో ఇస్తూనే ఉండాలి.అవేంటో ఇక్కడ చూద్దాం.

1. కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటి పిల్లలకు తాగించాలి.

2. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పంచదార, ఉప్పు కలిపిన నీరు తాగించండి.

3. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, నిమ్మ రసం తాగిస్తూ ఉండాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.

4. 5 లేదా 6 నెలల పిల్లలకు తినగలిగిన పళ్ళను ఆహారంగా పెట్టొచ్చు. మాములుగా కంటే వేసవి కాలంలో ఎక్కువగా పళ్లను పెట్టాలి.

5. కరక్కాయను అరగతీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తల నొప్పి, కళ్ల మంటలు తగ్గుతాయి.

Also Read: Kitchen: ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?

వర్క్ వుట్ చేసిన తర్వాత ఈ డ్రింక్స్ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో?

Advertisement

Next Story

Most Viewed