ఏకకాలంలో ఆరు పెయింటింగ్స్ వేసిన కళాకారుడు!

by Disha News Web Desk |
ఏకకాలంలో ఆరు పెయింటింగ్స్ వేసిన కళాకారుడు!
X

దిశ, ఫీచర్స్: కళాకారులు అద్భుతమైన కళాఖండాలను రూపొందించి, తమ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అయితే తమ ప్రత్యేకతను చాటుకునేందుకు, అందరికంటే భిన్నమని నిరూపించేందుకు కొత్త పంథాలో ప్రయత్నిస్తుంటారు. లిబియా కళాకారుడు అమెడో కూడా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా తన కళను ప్రదర్శిస్తూ మన్ననలు పొందుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకేసారి ఆరు కళాఖండాలు రూపొందించి ప్రజలను ఆశ్చర్యపరిచాడు.

లిబియాకు చెందిన ఓ వైద్య విద్యార్థి ఇటీవలే ఒకేసారి నాలుగు పోర్ట్రెయిట్స్ రూపొందించి తన కళాప్రతిభను చాటుకున్నాడు. దీన్ని సవాల్‌గా స్వీకరించిన అమెడో ఏకకాలంలో చేతుల్లో నాలుగు, కాళ్లతో రెండు స్కెచ్ పెన్స్ పట్టుకుని ఆరు వేర్వేరు షీట్‌లపై బొమ్మలను గీసి ఔరా అనిపించాడు. ఇందుకు సంబంధించిన టైమ్-లాప్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. 'పెయింటింగ్ ప్రాక్టీస్ కోసం ఎనిమిది రోజులు వెచ్చించాను. అనేక విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు విజయం సాధించాను. ఈ ఫలితాన్ని మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను' అని వీడియోతో పాటు తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

'2018 నుంచి పోర్ట్రెయిట్స్ గీయడం సాధన చేస్తున్నాను. అంతర్జాతీయ కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాను. ఆర్ట్ స్కిల్స్‌తో పాటు గ్రాఫిటీ కళలోనూ ప్రావీణ్యం సంపాదించాను' అని అమెడో పేర్కొన్నాడు.

https://twitter.com/stephenchip/status/1484308962803859456


Advertisement

Next Story