బస్సులు, రైళ్లల్లో జర్నీ చేస్తున్నారా?.. ఆ సమయంలో చేయకూడని పనులివే..

by Javid Pasha |   ( Updated:2024-01-19 13:48:25.0  )
బస్సులు, రైళ్లల్లో జర్నీ చేస్తున్నారా?.. ఆ సమయంలో చేయకూడని పనులివే..
X

దిశ, ఫీచర్స్ : మీరు బస్సులు, ట్రైన్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో జర్నీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? మీ చుట్టు పక్కల వ్యక్తుల బిహేవియర్ చూసి విసుగు చెందారా? ఇలా ఎప్పటికీ ఎవరూ చేయకూడదని అనిపించిందా? సరిగ్గా అలాంటి విషయాల గురించి నిపుణులు వెల్లడిస్తున్నారు. జర్నీలో ఉన్నప్పుడు కర్చీఫ్ లేదా చేతులు అడ్డు పెట్టుకోకుండా తుమ్మడం మొదలుకొని సీట్లపై కాళ్లు చాపుకొని కూర్చోవడం, స్పేస్ ఆక్రమించుకోవడం వరకు ఇతరులను ఇబ్బందులకు గురిచేసే ప్రవర్తనలు ఉన్నాయి. ఇవన్నీ సెల్ఫ్ అవేర్‌నెస్ లేని బ్యాడ్ హాబీస్‌గా పరిగణించబడతాయి. కాబట్టి వాటిని నివారించాల్సిన అవసరం ఉంది.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో జర్నీ చేస్తున్నప్పుడు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ముక్కుకు చేతులు గానీ, కర్చీఫ్ గానీ అడ్డం పెట్టుకోకుండా గట్టిగా తుమ్మేస్తుంటారు. అలాగే నోటిని కవర్ చేయకుండా దగ్గడం, ఆవలించడం చేస్తుంటారు. ఈ ప్రవర్తన చూసేవారికి అసహ్యం కలిగిస్తుంది. పైగా తుమ్మినప్పుడు ముక్కులో నుంచి, దగ్గినప్పుడు నోటిలో నుంచి వచ్చే తుంపరలు ఇతరుల మీద పడతాయి. క్రిములు, కరోనా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలతో కలిసి జర్నీ చేసేప్పుడు ఇతరులు తుమ్ముతున్నప్పుడు లేదా మీరే అలా చేయాల్సి వచ్చినప్పుడు ముక్కును, నోటిని దయచేసి కప్పుకోండి.

స్మెల్లింగ్ ఫుడ్ తినడం

కొందరికి బస్సులో లేదా ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఆహారం లేదా స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీరు తినే ఆహార పదార్థాలు ఎక్కువ వాసన కలిగినవి ఉన్నప్పుడు ఇతరులు పైకి చెప్పకపోయినా మిమ్మల్ని అసహ్యించుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వాసన వచ్చే పదార్థాలనే కాదు, అసలు దగ్గర ప్రయాణం అయినప్పుడు తినకపోవడమే మంచిది. రైలు లేదా బస్సు దిగింతర్వాత మీ శాండ్ విచ్ తీసుకోండి కానీ, నలుగురిలో తింటూ ఇబ్బంది పెట్టకండి.

ఫోన్‌లో బిగ్గరగా మాట్లాటం

పబ్లిక్ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాకపోవడం మంచిది. తప్పదనుకున్నప్పుడు మెల్లిగా తక్కువగా మాట్లాడితే బాగుంటుంది. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ కొందరు బస్సులో వెళ్తున్నప్పుడు తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసినప్పుడు చుట్టు పక్కల ఎవరున్నారనేది కూడా చూడకుండా బిగ్గరగా మాట్లాడుతుంటారు. పర్సనల్ విషయాలు, గొడవలు వంటివి కూడా ఇతరులకు వినబడేలా మాట్లాడేస్తుంటారు. చూసేవారికి, వినేవారికి ఇది నచ్చదు. అలాగే లౌడ్ స్పీకర్ పెట్టి మ్యూజిక్ వినడం కూడా ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీకు నచ్చిన మ్యూజిక్ ఇరులకు నచ్చాలని లేదు కాబట్టి.

పర్సనల్ హైజీన్, వృద్ధులకు సీటు ఇవ్వకపోవడం

ప్రజా రవాణాను ఎంచుకోవడం అంటే మీ ఇష్టమొచ్చినట్లు ఉండటం కాదు. బస్సులో లేదా రైలులో వెళ్లేకంటే ముందు స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం మంచిది. అలాగే జర్నీలో ఉన్నప్పుడు మీ చంకలను ఇతరులకు దగ్గరగా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ట్రిప్‌కు ముందు, ట్రిప్‌లో ఉన్నప్పుడు కూడా పర్సనల్ హైజీన్‌పై కాస్త ఫోకస్ పెట్టాలి. కొందరు.. ముఖ్యంగా యువతీ యువకులు సీటులో కూర్చొని ఉంటారు. వయస్సుపై బడిన పెద్ద మనిషి లేదా గర్భిణి సీటు లేక ఇబ్బంది పడుతున్నా లేచి వారిని కూర్చోండి అని చెప్పరు. ఇంతకంటే అధ్వాన్నం, బ్యాడ్ హాబీట్ మరొకటి ఉండదు.

కాళ్లు చాపడం, తాకరాని చోట తాకడం

పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో పోకిరీలు, స్వీయ అవగాహన లేని వింత మనుషులు తరచూ కనిపిస్తుంటారు. సీటుపై కూర్చొని కాళ్లు చాపుతుంటారు. సీట్లపై పెడుతుంటారు. దీనిని లెగ్ స్ర్పెండింగ్ లేదా మ్యాన్‌స్ప్రెడింగ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన. ప్రజా రవాణా అనేది ఎవరికీ పర్సనల్ స్పేస్‌ కాదనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం. కాబట్టి మీలో అటువంటి ప్రవర్తన ఉంటే వెంటనే మార్చుకోండి. అలాగే కొందరు పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీలో ఇతర వ్యక్తులను బట్ లేదా వీపు భాగాల్లో ఇతర తాకరాని చోట తాకుతుంటారు. ఇలా చేసేవారు ఇతరుల దృష్టిలో చాలా చెడ్డవారిగా మిగిలిపోతారు. పైగా ఇది సరైన ప్రవర్తన కాదు.

మరికొన్ని బ్యాడ్ హాబిట్స్

పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో రద్దీగా ఉన్నప్పుడు ముందుకు వెళ్లండని నెట్టడం, గట్టిగా అరవడం, డోర్ వద్ద నుంచోవడం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అట్లనే బస్సులో కూర్చున్నప్పుడు మీరే కాకుండా మీ బ్యాగు పెట్టడానికి కూడా ఒక సీటును ఆక్రమించుకోవడం మంచిది కాదు. మీ బ్యాగ్‌ని మీ ఒడిలో పెట్టుకోండి. మరొకరికి సీటు ఇవ్వండి. దీంతోపాటు మీ మోచేతులు, కాళ్లు ఇతరులకు తగలకుండా జాగ్రత్త పడాలి. అలాగే న్యూస్ పేపర్ తెరవడం, గోర్లు కొరకడం, స్మెల్ వచ్చే నెయిల్ పాలిష్ కలిగి ఉండటం, వృద్ధులు, గర్భిణులకు సీటు ఇవ్వకపోవడం మిమ్మల్ని ఇతరులు అసహ్యించుకునేలా చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed