Bread : బ్రెడ్ ఫ్రిజ్‌లో పెట్టినా ఫంగస్ పడుతోందా?.. ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది!

by Javid Pasha |
Bread : బ్రెడ్ ఫ్రిజ్‌లో పెట్టినా ఫంగస్ పడుతోందా?.. ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది!
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు కూడా అందుకు తగినట్లుగా మారుతున్నాయి. ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ తింటున్నప్పటికీ అప్పుడప్పుడైనా తక్షణంగా ఆకలి తీర్చుకునే స్నాక్స్, బ్రెడ్ ముక్క వంటివి తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే పలువురు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్‌తో తయారు చేసిన పలు పదార్థాలు తింటుంటారు. అయితే చాలా వరకు బ్రెడ్ ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ కొన్ని రోజులకు ఫంగస్ వచ్చి పాడయ్యే అవకాశం ఎక్కువ. అలా జరగకూడదంటే నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

బ్రెడ్ తయారు చేసేటప్పుడు అందులోని స్టార్చ్ అణువులు నీటిని గ్రహించడం సాధారంగా జరిగే ప్రాసెస్. దీంతో అది మృదువుగా, మెత్తగా అనిపిస్తుంది. అయితే దానిని చల్లటి ప్రదేశం లేదా ఫ్రిజ్‌లో ఐదారు రోజులకు మించి ఉంచితే పాడవుతుంది. ఎందుకంటే కూల్ వాతావరణంలో ఉంచినప్పుడు బ్రెడ్‌లోని స్టార్చ్ అణువులు తిరిగి స్ఫుటీకరించడం కారణంగా దాని నుంచి నీటిని లేదా తేమను బయటకు పంపుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారుతుంది. అలాగని బయటి వాతావరణంలో ఉంచినా అదే జరుగుతుంది. పైగా ఇలాంటప్పుడు దానిపై ఫంగస్ చేరుతుంది. తినడంవల్ల వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు రావచ్చు. అయితే బ్రెడ్‌ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంచితే ఇలా జరగదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఓపెన్ చేసి పెట్టినా ఫంగస్ రాకుండా ఉండాలంటే.. దానిని పరిశుభ్రమైన పొడివస్త్రంలో చుట్టి ఉంచాలని చెప్తున్నారు. దీంతో బ్రెడ్ పాడవకుండా ఉంటుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed