ఈ రాళ్లు వాటికవే కదులుతున్నాయి.. పిల్లలను కంటున్నాయి.. ఊహకందని రహస్యం..

by Sujitha Rachapalli |
ఈ రాళ్లు వాటికవే కదులుతున్నాయి.. పిల్లలను కంటున్నాయి.. ఊహకందని రహస్యం..
X

దిశ, ఫీచర్స్ : లివింగ్ స్టోన్స్ ను... లిథాప్స్ లేదా స్టోన్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు, ఇవి రాళ్లు లేదా గులకరాళ్లను పోలి ఉండే ఒక రకమైన సక్యూలెంట్. నిజానికి ఇవి మొక్కలే కానీ రూపంలో రాళ్ల మాదిరిగా ఉండి.. నెమ్మదిగా పెరుగుతూ రెండు లేదా అంతకంటే ఎక్కువ మొక్కలుగా విడిపోతాయి. పెరుగుదల కారణంగా స్థలాన్ని కొద్దిగా మార్చినట్లు అనిపిస్తుంది. ఇక ఇవి విత్తనాల నుంచి కూడా మొలకెత్తుతాయని, పునరుత్పత్తి అలాగే జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.

ఇప్పటి వరకు నాలుగు రకాల లివింగ్ స్టోన్స్ గురించి తెలియగా.. వీటిలో లిథాప్స్ అత్యంత సాధారణ రకం. కాగా ప్లీయోస్పిలోస్, టైటానోప్సిస్, కోనోఫైటమ్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఎడారుల్లో కనిపించే ఇవి ఎదిగేందుకు బాగా ఎండిపోయే నేల అవసరం కాగా అరుదుగా నీరు అందితే సరిపోతుంది. అయితే అతిగా సేకరించడం వల్ల ఇవి అంతరించిపోతుండగా.. వీటి రక్షణకు అంతర్జాతీయ చట్టాలు అమలులోకి వచ్చాయని తెలుస్తుంది.

ఆసక్తికర వాస్తవాలు :

1. లిథాప్స్ 50 సంవత్సరాల వరకు జీవించగలవు.

2. విపరీతమైన పరిస్థితులను తట్టుకోగలవు.

3. కొన్ని జాతులు సీజన్‌ను బట్టి రంగును మారుస్తాయి.

కొన్ని సంస్కృతుల్లో వీటిని స్థితిస్థాపకత, అనుకూలత, సరళతకు ప్రతీకగా భావిస్తారు.

సాంప్రదాయ ఆఫ్రికన్ మెడిసిన్‌లో ఉపయోగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed