HEALTHY FOODS ఈ ఆహారాలను వండిన మరుసటి రోజు తింటే ఆ రుచే వెరబ్బా.. పైగా!

by Anjali |
HEALTHY FOODS ఈ ఆహారాలను వండిన మరుసటి రోజు తింటే ఆ రుచే వెరబ్బా.. పైగా!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్య నిపుణులు ఎవరైనా సరే వేడి వేడి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఫుడ్ ప్రిపేరైన 2 గంటల్లో తింటే మనిషి హెల్తీగా ఉంటారంటారు. ఎందుకంటే టైమ్ గడిచేకొద్ది ఆహారంలోని పోషక విలువలు తగ్గపోతాయి. అయితే పలు ఆహార పదార్థాల్లో మాత్రం వండిన తర్వాత సమయం అయిపోయేకొద్ది పోషకాలు పుష్కలంగాపెరుగుతాయట. మరీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బాబూలీ శనగల కర్రీ..

కాబూలీ శనగలతో కర్రీ వండాక తినడం కంటే మరుసటి రోజు తింటేనే రుచి ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు సాధారణ శనిగలతో వండిన కర్రీ కూడా మరుసటి రోజు తింటే.. ఆ శనిగలు మందంగా మారి, తినేటప్పుడు ఎంతో రుచినిస్తాయట.

* అన్నం..

ఎవరైన సరే సాధారణంగా వేడి వేడి అన్నం తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వండిన మరుసటి రోజు తింటే ఆరోగ్యానికి మేలట. ఎందుంటే.. మరుసటి రోజు అన్నంలో పోషకాల విలువ రెట్టింపు అవుతుంది. నిరోధక కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. అలాగే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంతో ఉపయోగపడుతుందట.

* రొట్టెలు..

రాత్రి సమయంలో రొట్టెలు చేసి.. మార్నింగ్ తింటే ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఎక్స్‌ఫర్ట్స్ చెబుతున్నారు. అలాగే శరీరానికి ఖనిజాలు విటమిన్లు అంది మనిషి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. కాగా నైట్ రొట్టెలు చేసుకుని ఉదయం పూట తినడానికి ట్రై చేయండి.

* బిర్యానీ..

ఎక్కువమంది బిర్యానినీ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టి మార్నింగ్ తినడానికి ఇష్టపడుతుంటారు. దీంతో హెల్త్ కరాబ్ అయిపోతుందని పేరెంట్స్ భయపడిపోతుంటారు. కానీ బిర్యానీ అదే రోజు ప్రిపేర్ చేసింది తినడం కన్నా మరుసటి రోజు తింటేనే ఫుల్ టేస్టీగా ఉంటుందట. పలు రకాల మసాలాలు ముక్కకు అండ్ బిర్యానీ అన్నానికి బాగా పడుతుంది. దీంతో రుచి అదిరిపోతుందంతే.

* పలు రకాల కర్రీస్..

టమాటా కూర, ఆనియన్ గ్రేవీ, సాంబార్, మటన్, చికెన్ పనీర్ కర్రీ మరుసటి రోజు తింటేనే ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు నిపుణులు. వీటితో పాటుగా క్యారెట్ హల్వా కూడా నెక్ట్స్ డే తింటే స్వీట్ రుచి రెట్టింపు అవుతుందట.

* మొలకెత్తిన విత్తనాలు..

మొలకెత్తిన విత్తనాలు మరుసటి రోజు ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అలాగే దాల్ మఖానీ కూడా. రాజ్మా కూరను కూడా మరుసటి రోజు తింటే టేస్ట్ తోపాటు ఆరోగ్యానికి మంచిది.

గమనిక: ఈ వార్తలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా అందించడం జరిగింది. దిశ దీనిని ధృవీకరించలేదు.

Advertisement

Next Story