డయాబెటిక్ పేషెంట్లకు ఈ ఆహారాలు ఎంతో మేలు!

by Prasanna |   ( Updated:2023-08-30 13:19:05.0  )
డయాబెటిక్ పేషెంట్లకు ఈ ఆహారాలు ఎంతో మేలు!
X

దిశ,వెబ్ డెస్క్: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మనుషులు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రమాదకరమైన వ్యాధులలో మధుమేహం కూడా ఒకటి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలను చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచుతుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

కాకరకాయ

షుగర్ పేషెంట్లకు కాకరకాయ మంచి ఆహారమని వైద్యులు చెబుతుంటారు. డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో కాకరకాయను చేర్చుకోవాలి. మీరు కాకరకాయ రసం తాగిన.. రక్తంలో చక్కెర స్థాయిని నార్మల్ గా ఉంచుతుంది.

మెంతులు

డయాబెటిస్‌లో అదుపు చేయడంలో మెంతులు కూడా బాగా పని చేస్తాయి. దీనిలో ఫైబర్ మెటబాలిజంను కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారు మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఈ నీటిని గింజలతో కలిపి సేవించాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి రోజూ గ్రీన్ టీని తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed