- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తహీనతను దూరం చేసే సూపర్ ఫ్రూట్స్ ఇవే .. డైట్‌లో చేర్చుకుంటే..
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్త్రీలు, చిన్నారులను ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వంటి కారణాలతో ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతోపాటు బిజీ లైఫ్ షెడ్యూల్, ఇతరత్రా పనులవల్ల కొందరు ఇండ్లల్లో వండుకొని తినడం తగ్గించేసేసి బయటి ఆహారానికి మొగ్గు చూపుతున్నారు. ఫాస్ట్ ఫుడ్‌తో కడుపు నింపుకుంటున్నారు. దీనివల్ల కూడా పోషకాలు అందక రక్త హీనత ఏర్పడుతుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక వ్యాధులు దాడిచేస్తాయి. ముఖ్యంగా బలహీనత, రక్త హీనత, చెస్ట్ పెయిన్, హార్ట్ రేట్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. అయితే ఆహారంలో భాగంగా తీసుకునే కొన్ని పండ్లు రక్తహీనతను దూరం చేయడంలో అద్భుతంగా పనిచేస్తే సూపర్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
* దానిమ్మ : రక్తహీనత ఉన్నవారు, లేనివారు కూడా అప్పుడప్పుడూ దానిమ్మను తింటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాడీలో హిమోగ్లోబిన్ పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. డైలీ ఉదయంపూట ఒక దానిమ్మ తింటే నెలరోజుల్లో రక్తహీనత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
* యాపిల్ : ఏడాదిపొడవునా మార్కెట్లో లభించే పోషకాలు కలిగిన ఫలం యాపిల్. ఇది రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. డైలీ బ్రేక్ ఫాస్ట్‌కు ముందు యాపిల్‌ను శుభ్రంగా కడిగి దానిని తొక్కతో సహా తినడంవల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. రక్తహీనత తగ్గిపోతుంది.
* గ్రేప్స్ : శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడంలో గ్రేప్స్ లేదా ద్రాక్ష పండ్లు మేలు చేస్తాయి. బ్లాక్ గ్రేప్స్ ఇంకా మంచిదని నిపుణులు చెప్తుంటారు. ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచడం ద్వారా రక్తాన్ని ప్రొడ్యూస్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా రక్తహీతనకు చెక్ పెట్టవచ్చు.
* బనానా, ఆరెంజ్ : అరటి పండ్లల్లో ఫైబర్ కంటెంట్ ఫుల్లుగా ఉంటుంది. దాంతోపాటు అధికమొత్తంలో ఐరన్, ఇతర పోషకాలు ఉండటంవల్ల రక్తహీనత నుంచి బయడపడేందుకు సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడం ద్వారా రక్త హీనతను దూరం చేస్తుంది. ఇక ఆరెంజ్ కూడా హిమోగ్లోబిన్ లోపాన్ని నివారిస్తుంది. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.