Period problems: పెళ్లి తర్వాత మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ .. కారణాలు ఇవే అంటున్న నిపుణులు!

by Jakkula Samataha |
Period problems: పెళ్లి తర్వాత మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ .. కారణాలు ఇవే అంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో క్రమరహిత పీరియడ్స్ ఒకటి. ముఖ్యంగా పెళ్లైన తర్వాత చాలా మంది ఆడవారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు ఎందుకు వివాహం తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత పీరియడ్స్ సరైన సమయానికి రాకపోవడానికి గల కారణాలు గురించి ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

అమ్మాయిలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రజస్వల కావడం అనేది సహజం. ప్రతి నెల జరిగే సాధారణమైన ప్రక్రియ ఇది. అయితే కొంత మంది మహిళలు పెళ్లికి ముందు ఎలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. కానీ పెళ్లి తర్వాత మాత్రం పీరియడ్స్ మిస్ కావడం, అధిక రక్తస్రావం, త్వర త్వరగా పీరియడ్స్ రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వాతావరణం, కొత్త రకమైన ఫుడ్, భావోద్వేగాలు, ఒత్తిడి వంటి వాటి వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందంట. దీని వలన ఈస్ట్రోజన్ , ప్రొజెస్టిరాన్ వంటి పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగి పీరియడ్స్ సరైన టైమ్‌కి రాకపోవడం జరుగుతుందంట.

అంతే కాకుండా పెళ్లైన తర్వాత నిద్రలో మార్పు రావడం, లేదా సంతానం కోసం లేదా, ప్రెగ్నెంట్ మిస్ కావడానికి కొన్ని రకాల మెడిసన్స్ వాడుతుంటారు. దీని వలన కూడా క్రమరహిత పీరియడ్స్ సమస్య ఏర్పడుతుంది. అదే విధంగా శారీరక శ్రమ పెరగడం లేదా తగ్గడం , అధిక ఒత్తిడి వంటి సమస్యల వలన కూడా పీరియడ్స్ సమస్య వస్తుందని ప్రముఖ గైనకాలజిస్ట్‌లు తెలియజేస్తున్నారు.

(నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed