- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలను ఫోన్, టీవీలకు దూరం చేసే బెస్ట్ టిప్స్ ఇవే!!
దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో పిల్లలు టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు విపరీతంగా అడక్ట్ అవుతున్నారు. టీవీ చూసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీనికి కారణం ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌తో వస్తున్న మూవీస్, వెబ్ సిరీస్, బుల్లితెర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది తొందరగా నిద్రించగా.. మరి కొంతమందికైతే అర్ధరాత్రి వరకు టీవీ చూసే అలవాటు ఉంటుంది.
ఇక స్మార్ట్ ఫోన్ల వాడకం విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎంత షార్పుగా ఉన్నారంటే.. టెక్నాలజీ మీద పట్టు అంతా ఇంత కాదు.. మనం వారికి ఏ విషయంపై అవగాహన తీసుకురావలని చూస్తామో అంతకంటే ముందే పిల్లలే నేర్చుకుని మరీ, పెద్దలకు చెబుతున్నారు. ఫోన్లలో గేమ్స్ ఆడటం, వీడియోలు పెట్టుకోవడం.. ఇలా వారంతట వారే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడంతో పట్టు సాధిస్తున్నారు. దీంతో ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో పేరెంట్స్.. మా పిల్లలను ఫోన్ ఎడిక్షన్ నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నాం.. ఎలా? అంటూ కంప్లైంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లైతే పిల్లలను టీవీలకు, ఫోన్లకు దూరం చేసే ఈ బెస్ట్ టిప్స్ ఫాలో అవ్వండి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పిల్లలకు డ్రాయింగ్, కలరింగ్, పేపర్ క్రాఫ్ట్, ఆర్ట్ వర్క్ వంటివి దగ్గరుండి నేర్పించండి.
* కుకింగ్ చేయడం నేర్పించండి. ఉదా.. కేక్ రెడీ చేస్తున్నప్పుడు మిక్సింగ్ చేయడం, బేకింగ్ చేయడం.
* మైండ్ పదును పెట్టే ఆటలు ఆడించండి. క్యారమ్స్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్ వంటి ఆటలు ఆడించాలి.
* పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి పుస్తకాలు చదవండి. అప్పుడు వారికి ఆటోమెటిక్‌గా చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
* ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేయించండి. గార్డెన్‌లో విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, వాటికి వాటర్ పోయడం లాంటివి చేయండి.