- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లక్షలు, కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు.. వంద రూపాయలతో క్యాన్సర్‌కు చెక్
దిశ, ఫీచర్స్: క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం కారణంగా సంభవించే మరణాల్లో.. రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. ఇది మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతే కాకుండా వంశపారపర్యంగా కూడా కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, జీవనశైలి కారణంగాను క్యాన్సర్లు వస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు ఎంతో కాలంగా ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. లక్షలు లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పాటు మందులు కూడా వాడుతున్నప్పటికీ ఇవి తగ్గుముఖం పట్టకపోగా.. ఒకానొక స్టేజ్‌లో ప్రాణాలు సైతం బలితీసుకుంటున్నాయి. అయితే.. క్యాన్సర్ నివారణను కనుగొనడం ఇప్పటివరకు అంతుచిక్కని సమస్య అయినప్పటికీ.. దీనిపై తాజాగా టాటా మెమోరియల్ హాస్పిటల్ ఓ పరిశోధన చేసింది.
అయితే.. ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్నవారు తర్వాత కొంతకాలానికి మళ్లీ అదే సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టే దిశగా టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలు చేసి రెండోసారి క్యాన్సర్ రాకుండా ఔషధాన్ని కనిపెట్టింది. ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. క్యాన్సర్ రెండవసారి దరిచేరకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు వెల్లడించింది. క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు ఓ టాబ్లెట్‌ను అభివృద్ధి చేసినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. క్యాన్సర్ చికిత్స సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించడానికి జూన్-జూలైలో ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్‌పై టీఎంసీ వైద్యులు దాదాపు పదేళ్ల పాటు కృషి చేశారని డాక్టర్ బద్వే వెల్లడించారు. ఒకసారి ఆమోదించబడిన ఈ టాబ్లెట్ కీమోథెరపీ వంటి చికిత్సల సైడ్ ఎఫెక్ట్స్ 50 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అలాగే, క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గుతుందని డాక్టర్ బద్వే పేర్కొన్నారు.
డాక్టర్ ఇంద్రనీల్ మిత్రా మాట్లాడుతూ.. ‘మేము ఒక చిన్న ప్రయోగం చేశాం. దీనిలో మానవ రొమ్ము క్యాన్సర్ కణాలను తీసుకొని వాటిని రోగనిరోధక శక్తి లేని ఎలుకలలో అమర్చాము. ఆరు వారాల్లో ఒక చిన్న కణితి ఏర్పడింది. క్యాన్సర్ చికిత్స-కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్స ప్రకారం ఎలుకలను మూడు వర్గాలుగా విభజించాము. మూడు శస్త్రచికిత్సలు ఎలుక మెదడులో క్రోమాటిన్‌ను పెంచాయని కనుగొన్నాము’ అని తెలిపారు.
డాక్టర్ రాజేంద్ర బద్వే మాట్లాడుతూ.. ‘క్రోమాటిన్‌ను నాశనం చేయడంలో రెస్‌వెరాట్రాల్, కాపర్ కలయిక సహాయపడుతుందని మేము కనుగొన్నాము. మా అధ్యయనాలలో మౌఖికంగా ఇవ్వడానికి ఈ కలయికను ఉపయోగించాము. ఇది మెటాస్టాసిస్‌ను నిరోధిస్తుందని కనుగొన్నాము. మన రోగుల ఫలితాలను.. వీలైతే, భారతదేశంలోని సాధారణ జనాభా ఫలితాలను మనం ఎంత ఉత్తమంగా మెరుగుపరచగలమో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం దీనిని మానవులపై పరీక్షించాల్సిన అవసరం ఉంది. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసే అంచున ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేయగలదని, త్వరలో ఇది రోగులకు అంటుబాటులోకి రానుందని తెలిపారు. అలాగే, మేము చాలా కాలంగా వెలికితీయలేకపోయిన మెటాస్టాసిస్‌కి సంబంధించిన మెకానిజమ్‌ను పరిశోధనలో పరిశీలిస్తుంది. కణాలలో మెటాస్టాసిస్ సంభవించవచ్చు, మెటాస్టాసిస్‌కు దారితీసేది ఏమిటి?, ఈ రెండు విషయాలను ఈ పరిశోధన ద్వారా మేము అర్థం చేసుకున్నాము. అయినప్పటికీ, క్యాన్సర్ పునరుజ్జీవనాన్ని నివారించడానికి ఈ కొత్త చికిత్స ప్రయోజనాలను పొందేందుకు, ట్రయల్స్ కనీసం 5-6 సంవత్సరాలు పడుతుందని’ డాక్టర్ బద్వే చెప్పుకొచ్చారు.
Read More..
వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? .. మీరు చేసే పొరపాట్లు ఇవే..