కాల్షియం కోసం పాలు తాగాల్సిన అవసరం లేదు.. వీటిని కూడా తీసుకోవచ్చు

by Prasanna |   ( Updated:2024-04-24 07:45:30.0  )
కాల్షియం కోసం పాలు తాగాల్సిన అవసరం లేదు.. వీటిని కూడా తీసుకోవచ్చు
X

దిశ, ఫీచర్స్: మన శరీరంలో కాల్షియం లోపించడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి మన రోజువారీ ఆహారంలోకాల్షియం పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియం అనగానే ప్రతి ఒక్కరికీ పాలు గుర్తొస్తాయి. అయితే, అందరూ పాలు తాగడానికి ఇష్టపడరు. కాల్షియం కేవలం పాలలో మాత్రమే కాకుండా అనేక ఆహారాలలో లభిస్తుంది. మీరు పాలు తాగకూడదనుకుంటే, మీ శరీరానికి కాల్షియం అందించడానికి మీరు ఇతర ఆహార పదార్ధాలను తీసుకోవచ్చు.

పాలతో తయారయ్యే పెరుగులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నిజానికి, పెరుగులో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. మీరు పెరుగన్నంలో మీకు ఇష్టమైన పండ్లను కూడా వేసుకుని తినవచ్చు. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. అయితే ఆరెంజ్ జ్యూస్ కూడా ఎక్కువగా తాగకండి. ఇది రోజుకి ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగకూడదు. బాదం పాలలో కాల్షియంతో పాటు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. ఒక గ్లాసు బాదం పాలలో ఆవు పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే దీనిలో ప్రొటీన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed