Morning Sex: ఎందుకు చేయాలి..? కపుల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇదే!

by Nagaya |   ( Updated:2023-07-10 13:41:28.0  )
Morning Sex: ఎందుకు చేయాలి..? కపుల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితులు ఉన్నాయి. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో డబ్బుల వెనక పరుగులు పెట్టే రోజులు ఇవి. ఈ బిజీ లైఫ్‌లో మనుషులు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. మరోవైపు వృత్తిపరమైన ఒత్తిడితో మెంటల్ టెన్షన్లకు గురవుతున్నారు. ఇదే క్రమంలో వైవాహిక జీవితంపై ఆసక్తిని కోల్పోతున్నారు. సమయం లేదంటూ శృంగారానికి కూడా దూరమవుతున్నారు. అయితే ఇలాంటి వారికి చక్కటి సలహా ఇస్తున్నారు సెక్సాలాజిస్టులు(Sexologist). ఉదయాన్నే ఓ అర గంట సమయం కేటాయిస్తే చాలు.. చక్కటి ఆరోగ్యంతోపాటు శరీరానికి తగినంత వ్యాయమం, రోజంతా ప్రశాంతత, ఎనర్జీ, నిత్య యవ్వనం, కపుల్స్ మధ్య గాఢమైన ప్రేమ మీ సొంతం అంటున్నారు. అదేలాగో చూద్దాం.


భార్యాభర్తలు ఉదయాన్నే సెక్స్ చేస్తే బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు సెక్సాలాజిస్టులు. పొద్దంతా బిజీగా ఉండే దంపతులు ఉదయాన్నే శృంగారానికి టైం కేటాయించాలంటున్నారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు అధిక మొత్తంలో రిలీజ్ అవుతాయి. ఇది మనిషిని రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉండేలా చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఒక్క నిమిషం సెక్స్ చేస్తే ఐదు కేలరీలు బర్న్ అవుతాయి. అలా రోజుకు 30 నిమిషాలు శృంగారానికి సమయం కేటాయిస్తే ఎంత వ్యాయమం చేసినట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఎండార్ఫిన్లు విరివిగా విడుదల అవుతాయి. ఇది మానసిన స్థితిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరం బ్యాకీరియా, వైరస్‌ల భారిన పడకుండా రక్షణ వ్యవస్థను ఏర్పరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆక్సిటోసిన్, బీటా-ఎండార్ఫిన్‌లు, ఇతర హార్మోన్‌లను విడుదల చేసి మొఖంపై ముడుతలు పడకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మార్నింగ్ సెక్స్‌లో క్లైమాక్స్ దశ ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేలా ఉంటుంది. ఇవన్నీ అనేక అధ్యయనాల్లో ధ్రువీకరించడడ్డాయని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు.


Click here to read more articles about Morning Sex

Advertisement

Next Story