- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్జూరం పాలతో ఎన్నో లాభాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉన్న జీవన శైలీలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషయం పక్కన పెట్టడంతో శరీరంలో విటమిన్స్ లోపిస్తున్నాయి. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యమైనవి శరీరంలో రక్తం లేకపోవడం. శరీరంలో తగిన మోతాదులో రక్తం లేకపోతే నీరసంగా ఉంటుంది. అయితే.. మీ శరీరంలో ఈజీగా రక్తం అభివృద్ధి కావాలంటే ఈ విధంగా చేయండి.
* ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే మంచిది. దీని వల్ల రక్తం ఉత్పత్తి అవడంతో పాటు రక్త సరఫరా మెరుగుపడి బలం కూడా వస్తుంది.
* ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి.
* పాలలో కాల్షియం, రైబోఫ్లోవిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి.
* పాలతో కలిపి ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
* ఖర్జూరాలను రాత్రిపూట పాలలో వేసి తెల్లారాక తాగితే మంచి శక్తి వస్తుంది.
* ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
* అంతే కాకుండా ఖర్జూరం పాలలో ఉండే విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
* ఖర్జూరం పాలలో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.
Also Read..