ఆరుగురు పురుషులను చితకబాదిన మహిళ.. (వీడియో)

by Manoj |
ఆరుగురు పురుషులను చితకబాదిన మహిళ.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : మహిళ రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే అమ్మాయిలను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం మంచిదని చెప్తుంటారు పెద్దలు. కరాటే, తైక్వాండ్ వంటివి నేర్చుకుంటే తమను తాము రక్షించుకోవచ్చని సూచిస్తారు.

ఈ క్రమంలోనే వీటిలో ప్రావీణ్యురాలైన మహిళ.. తనను వేధిస్తున్న ఆరుగురు వ్యక్తులను చితకబాదింది. ఒంటరిగా వెళ్తున్న తనపై దాడి చేసేందుకు ప్రయత్నించే సందర్భంలో పులిలా ఎటాక్ చేసి ఆరుగురిని చావబాదింది. 25 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 'ది ఫిగెన్' అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 'నింజా అనడానికి నిజమైన ఉదాహరణ' అని అమ్మాయిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed