ఇంట్లో ఎలుక‌లున్నాయ‌ని పిల్లిని తెచ్చారు.. తీరా చూస్తే అవి ఇలా..(వీడియో)

by Sumithra |
ఇంట్లో ఎలుక‌లున్నాయ‌ని పిల్లిని తెచ్చారు.. తీరా చూస్తే అవి ఇలా..(వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఎలుకా పిల్లులు జ‌న్మ‌త‌హా స‌హ‌జ శ‌త్రువ‌ల‌ని అనుకుంటాము. అయితే, టామ్ అండ్ జెర్రీ క్యార‌క్ట‌ర్లు ఒక‌టైనట్లు రియ‌ల్ లైఫ్‌లోనూ అలాంటి ప‌రిస్థితే వ‌చ్చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. నిజానికి, మ‌నుషులు ఇళ్ల‌ల్లో పెంపుడు జంతువుల‌ను తెచ్చుకున్న త‌ర్వాత కొన్ని స‌హ‌జ శ‌త్రువులు కూడా స్నేహంగా మారుతున్న ప‌రిణామం వ‌చ్చింది. ఒక విధంగా జీవుల‌న్నింటీ ఈ ప్రేమ‌, స్నేహం అనేది స‌హ‌జ ల‌క్ష‌ణాల‌కంటే బ‌లంగా క‌నిపిస్తాయన‌డంలో ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదు అనిపిస్తుంది. ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో దీనికి స‌రైన ఉదాహ‌ర‌ణ‌గా ఉంటుంది. త‌మ‌ పెర‌ట్లో ఎలుక‌లు తిరుగుతున్నాయ‌ని, వాటి ఎలాగైనా త‌రిమేయాల‌ని అనుకొని, ఒక పిల్లిని తెచ్చుకున్నారు. ఇక‌, బాధ త‌ప్పింది అనుకోగానే, అస‌లు సంగ‌తి త‌ర్వాత తెలిసింది. "మీరు పిల్లిని తెచ్చుకుంటే, అది మీ పెరట్లో ఉన్న పెద్ద ఎలుకను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము" అనే శీర్షిక‌తో రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో పిల్లి, ఎలుక ఒకదానితో ఒకటి ఆడుకుంటూ, స్నేహంగా ఉంటాయి. ఈ వీడియో నెటిజ‌నుల‌ను న‌వ్వించ‌డ‌మే కాదు, గుండెను తాకుతుంది. స్నేహం ఎంత అమాయ‌కంగా, అద్భుతంగా ఉంటుందో తెలియ‌జేస్తుంది. ఈ స‌ర‌దా వీడియోను మీరూ చూడండి..

వీడియో కోసం: https://www.reddit.com/r/aww/comments/vah5jj/when_you_get_a_cat_hoping_it_will_help_you_get/?utm_term=1892047951&utm_medium=post_embed&utm_source=embed&utm_name=&utm_content=header

Advertisement

Next Story

Most Viewed