- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆపదలో ఉన్నారా?.. నో ప్రాబ్లం.. ప్రజల్లో పెరుగుతున్న హెల్పింగ్ నేచర్
దిశ, ఫీచర్స్ : మనిషి అన్నాక హెల్పింగ్ నేచర్ ఉండాలంటారు పెద్దలు. ప్రముఖులు, మానసిక నిపుణులు తరచుగా సాయం చేసే స్వభావం, దయాగుణం వంటి అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఒక విధంగా ఈ ప్రపంచమంతా ‘హెల్పింగ్ నేచర్’పై ఆధారపడి నడుస్తోందనడంలో ఆశ్చర్యం లేదని ఎక్స్‌పర్ట్స్ చెప్తుంటారు. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ లేదా సహాయపడే గుణం మానవులను ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. దానిని అలవర్చుకున్న వారికి మంచి గుర్తింపును తెచ్చి పెడుతుంది. హెల్ప్ చేసిన వారు, పొందినవారు కూడా ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. అందుకే సమాజ పురోగతికి ఇది అవసరం అంటుంటారు సామాజిక వేత్తలు. అయితే ప్రజల్లో ఇప్పుడు ఇది నిండుగా ఉంటోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్‌కు చెందిన సోషల్ సైంటిస్టుల అధ్యయనంలో కూడా వెల్లడైంది.
వ్యక్తుల్లో హెల్పింగ్ నేచర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ సోషియాలజిస్ట్ గియోవన్నీ రోస్సీ ఆధ్వర్యంలో సైంటిస్టుల బృందం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, ఈక్వెడార్, యునైటెడ్ కింగ్‌డంలలో పర్యటించి పరిశీలించింది. ఈ సందర్భంగా టీమ్‌లోని శాస్త్రవేత్తలు వ్యక్తులందరూ ఏదో ఒక సందర్భంలో హెల్పింగ్ నేచర్ ప్రదర్శిస్తారని, పరస్పర సహకారం కూడా కోరుతారని కనుగొన్నారు. అంతే కాదు.. తమకు హెల్ప్ చేయాలని అడగడమో లేదా ఎవరినైనా పంపాలని కోరడమో వంటివి మాటలు విన్పప్పుడు సహజంగానే చాలామంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుంటారని గుర్తించారు. అరుదుగా కొందరు హెల్ప్ చేయడానికి ఆసక్తి చూపరని, అయితే ఇలాంటి వారికి ప్రత్యేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. డిఫరెంట్ కల్చర్, వివిధ సాంస్కృతిక, సంప్రదాయిక, ఆర్థిక అంశాలు, పేదరికం వంటి కారణాలవల్ల కొందరు ఇతరులకు సాయం చేయాలని ఉన్నా చేయలేకపోతారని నిపుణులు గమనించారు. అలాంటి వారు కూడా ఒకానొక సందర్భంవస్తే తమ నమ్మకాలు, నియమాలు పక్కన పెట్టి హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు.
అడ్డంకిగా మారుతున్న పరిస్థితులు
సహాయం చేయడం విషయానికి వస్తే అరుదుగా కొన్ని దేశాల్లో కొందరు వ్యక్తులు ముందుకు రాకపోవడానికి డిఫరెంట్ కల్చర్ కీ రోల్ పోషిస్తోంది. ముఖ్యంగా ఇండోనేషియాలోని లామలేరాకు చెందిన తిమింగలం వేటగాళ్లు(whale hunters) ‘లార్జ్ క్యాచ్’ను ఎలా పంచుకోవాలనే దానిపై ఏర్పాటు చేసుకున్న నియమాన్ని తప్పక ఫాలో అవుతారు. దీని ప్రకారం వారు ఇతరులకు హెల్ప్ చేయరు. పంచుకునే విషయం ఏమాత్రం దయ చూపరు. ఇక టాంజానియాలోని హడ్జా ఫోరేజర్స్ నెగెటివ్ గాసిప్స్‌ను జనరేట్ చేస్తారనే భయంతో హెల్ప్ చేయరు. ప్రధానంగా ఆహార పదార్థాల విషయంలో ఇలా చేస్తారు. ఇది వాళ్ల కట్టుబాటు. ఇక కెన్యాలో ఓ కుగ్రామం పేరు ఓర్మా. ఇక్కడి ప్రజలు కూడా తమ కట్టుబాట్లలో భాగంగా తమ వస్తువులు, పదార్థాలు ఆపద సమయంలో కూడా ఇతరులకు ఇవ్వరట. ఇండియాలోనూ శుక్రవారం ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదని తిరస్కరించేవారు, మంగళవారం ప్రయాణం చేయకూడదని భావించేవారు తమ బలమైన కట్టుబాట్లు లేదా మూఢనమ్మకాల కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో నిరాకరిస్తారు. కానీ చాలా అరుదు.
కట్టుబాట్లు, నియమాలను అధిగమించి..
పరస్పర హెల్పింగ్ నేచర్‌ను అనేక దేశాల్లో పరిశీలించిన నిపుణులు చాలాచోట్ల ప్రతి 10 మందిలో ఏడుగురు సంస్కృతి, సంప్రదాయం వంటి నియమాలకు భిన్నంగా స్పందించడం గమనించారు. ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి హెల్పింగ్ నేచర్ విస్తరిస్తోందని అంటున్నారు. ఏదైనా సహాయం కోరితే, వారు చేయగలిగే పరిస్థితి ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. పైగా ఇలాంటివారు సాంస్కృతిక, సంప్రదాయిక నియమాలను, మూఢ నమ్మకాలను పట్టించుకోరు. ఒక వ్యక్తి హెల్పింగ్ కోరడాన్ని సీరియస్‌గా పరిగణిస్తారు. నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం కర్తవ్యంగా భావిస్తారట. వరల్డ్ వైడ్‌గా ఇలాంటి వ్యక్తులే సగటున ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సాయం చేస్తున్నారని వెయ్యిమందిపై చేసిన పరిశీలన ద్వారా వెల్లడైంది.