- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్వాస కోశాల్లో నిక్షిప్తమవుతున్న మైక్రోప్లాస్టిక్స్.. అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : పర్యావరణంలో కలిసిపోయిన విషపూరిత కాలుష్య కారకాలు, కెమికల్స్ కలిగి ఉన్న మైక్రోప్లాస్టిక్స్ మానవ శ్వాసకోశాల్లో ఎక్కువగా నిక్షిప్తం అవుతున్నాయని, ఇవి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఒక అధ్యయనం హెచ్చరించింది. 2022లో పరిశోధకులు ప్లాస్టిక్ ఉత్పత్తుల క్షీణత నుంచి పర్యావరణంలో కలుస్తున్న మైక్రో ప్లాస్టిక్స్‌ను మానవులు ప్రతీ గంటకు 16.2 బిట్‌ల వరకు పీల్చుకుంటున్నారని అంచనా వేశారు. దీని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ టీమ్, ఎగువ వాయుమార్గంలో మైక్రోప్లాస్టిక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డిపాజిషన్‌ను ఎనలైజ్ చేసేందుకు కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మోడల్‌ను డెవలప్ చేసింది.
పర్యావరణంలో కలిసిన చిన్న చిన్న ప్లాస్టిక్ అణువుల వివిధ ఆకారాలు, పరిమాణాలు (1.6, 2.56, and 5.56 microns) నెమ్మదిగా శ్వాస కోశాల్లోకి చేరడాన్ని, వాటి కదలికలను పరిశోదకులు కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మోడల్ ద్వారా కనుగొన్నారు. నాసికా కుహరం, ఒరోఫారింక్స్ లేదా గొంతు వెనుక భాగంలో ఉన్న హాట్ స్పాట్‌లలోకి ఇవి చేరుతాయని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుడు మొహమ్మద్ S. ఇస్లాం పేర్కొన్నాడు. పారిశ్రామిక కార్యకలాపాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో, ప్లాస్టిక్ తయారీ, అలాగే రీసైక్లింగ్ ఏరియాల నుంచి మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా వెలువడుతూ పర్యావరణంలో కలుస్తున్నాయని బ్రిస్బేన్‌లోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యువాన్‌టాంగ్‌గు తెలిపాడు. అయితే వీటిని వ్యక్తులు పీల్చడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు, రక్తహీనత, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు.
Read More: స్కిన్ ప్రాబ్లమ్స్‌తో గుండె జబ్బులు.. హెచ్చరిక సంకేతాలివే