నమ్మితే నట్టేట ముంచిన కుక్క.. Pizza Delivery తో అవాక్కైన ఇంటి యజమాని (వీడియో)

by Prasanna |   ( Updated:2023-10-02 09:21:43.0  )
నమ్మితే నట్టేట ముంచిన కుక్క.. Pizza Delivery తో అవాక్కైన ఇంటి యజమాని (వీడియో)
X

దిశ,వెబ్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరి టాలెంట్ వారు చూపిస్తూ ప్రతి ఒక్కరు ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మనుషులు అయిపోయారు అనుకుంటే ఇంట్లో ఉండే డాగ్స్ కూడా నా టాలెంట్ ఏంటో చూపిస్తా అంటూ ఇంటి యజమానికి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అస్సలు ఏమి జరిగిందంటే..

ఇంటి యజమాని ఒక పిజ్జా ఆర్థర్ చేయమంటే.. ఆర్డర్ పిజ్జా నౌ అంటూ ల్యాప్ టాప్ తీసి 100 కి పైగా ఆర్డర్ పెట్టేసి, ఆ కుక్క ఏమి తెలియనట్టే తన పని తాను చేసుకుంటుంది. ఆర్డర్ పెట్టిన పిజ్జా లు ఒక్కోటి ఇంటికి వస్తున్నాయి. ఆ కుక్క వాటిని తన ముందు పెట్టుకొని టీవి చూస్తూ పిజ్జా లు తినేస్తుంది. ఇంతలో యజమాని ఫోనుకి పిజ్జా బిల్ మెసేజ్ రావడంతో బయటకు వచ్చి చూస్తే.. ఇంటి నిండా పిజ్జా లే ఉన్నాయి. ఆ యజమానికి కోపం వచ్చి టెడ్డీ అని గట్టి గట్టిగ అరుస్తూ కుక్క దగ్గరికి వెళ్తాడు.. ఆ కుక్క ఏమి తెలియనట్టు అమాయకంగా మొఖం పెడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అది ఎన్ని రోజుల నుంచి ఆకలి మీద ఉందో ఎవరికీ తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story