- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిండి మిస్ అవుతున్నామనే భయం వెంటాడుతుందా? అయితే ఇది మీకోసమే..
దిశ, ఫీచర్స్ : ఏదైనా విషయంలో మిస్ అవుతామని, కోల్పోతామని భయపడుతుంటే.. దానిని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్(FOMO)అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సోషల్ సెన్స్‌కు సంబంధించిన విషయం. ఆహారం విషయంలో ఈ విధమైన ఆందోళన లేదా భయం అనుభవిస్తుంటే గనుక దానిని ఫియర్ ఆఫ్ ఫుడ్ మిస్సింగ్ ఔట్‌గా(FOODMO) నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండీ ఫుడ్ మిస్ అవుతామనే భయం ప్రబలంగా ఉందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. యూఎస్ కేంద్రంగా 2000 మంది సోషల్ మీడియా యూజర్లపై నిర్వహించిన స్టడీ ప్రకారం.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ట్రెండీ ఫుడ్ మిస్ అవుతామని ఆందోళన చెందుతున్నారు. 77 శాతం మంది ఫుడ్ రిలేటెడ్ ఫోమోను ఫీల్ అవుతున్నారు. 75 శాతం మంది ఆన్ లైన్‌లో కొత్త రకమైన ఆహారాన్ని చూడగానే దానిని తినాలని కోరుకుంటున్నారు. మిస్ అవుతామనే భయాన్ని నివారించడానికి 57 శాతం మంది సోషల్ మీడియా యూజర్లు ఆన్‌లైన్‌లో కనుగొన్న వంటకాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేగాక సగటున నెలకు నాలుగు ఆన్‌లైన్ వంటకాలను వండుతున్నారని సర్వేలో తేలింది.
సోషల్ మీడియా ప్రభావం
ఎన్విటిఎమ్ యాపిల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రజలు తయారు చేయడానికి ఇష్టపడే వంటకాలలో సోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దీంతో తాము తయారు చేసిన వంటకం వివరాలను సగటున నెలకు ఆరుసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ట్రెండీ ఫుడ్ ఇన్‌స్పిరేషన్‌ను కనుగొనే విషయంలో యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు దాదాపు 24 శాతం మంది అంగీకరిస్తున్నారు. కొందరు భోజన ప్రియులు ఒక రోజులో నాలుగు గంటలపాటు సోషల్ మీడియాలో గడిపితే గనుక, ఫుడ్ కంటెంట్ కోసం కనీసం ఏడుసార్లు సెర్చ్ చేస్తున్నారని సర్వేలో తేలింది. మరో సందర్భంలో పరిశీలించినప్పుడు సగటు వ్యక్తి సోషల్ మీడియాలో కనీసం 10 ఫుడ్ రిలేటెడ్ అకౌంట్స్‌ను ఫాలో అవుతుంటాడని వెల్లడైంది. ఇంకొందరు కేవలం ఫుడ్ కంటెంట్‌ను చూడటం కాకుండా కొత్త కొత్త ఆహార సంబంధిత అంశాలను వెతుకుతున్నారు. 67 శాతం మంది తమకు అవకాశం ఉంటే స్నాక్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కోరుకుంటున్నారు.
టేస్టీ వర్సెస్ హెల్తీ ఫుడ్
‘ఆరోగ్యకరమైనది’ తినడానికి టేస్ట్ అండ్ ఫ్లేవర్‌తో రాజీపడాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ విధమైన మనస్తత్వం కలిగిన వారు తరచుగా ‘అనారోగ్యకరమైనది’ అని భావించే ఆహారాన్ని కోరుకునేలా చేస్తుంది. వీరిలో FOMOను ప్రేరేపిస్తుంది. సోషల్ మీడియాలో ఆనందించే అల్పాహారం కలిగి ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైనది తక్కువగా ఉంటుంది’ అని డైటీషియన్లు పేర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రుచిగా ఉంటాయని భావించే ఆహారాల్లో ఎక్కువగా చిరుతిళ్లు, ప్రాసెస్ చేసినవి ఉంటున్నాయి. కాబట్టి ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి కాని, ఆరోగ్యం విషయంలో అంత ప్రభావవంతంగా ఉండవు. ఇక ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాలు చాలా వరకు తక్కువ రుచిని కలిగి ఉంటాయి. తాజా కూరగాయలు, మాంసంతో ఇంట్లో వండుకునే వంటకాలు ఈ కోవకు చెందుతాయి. ఇవి ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి కానీ చాలామందికి రుచిలో సంతోషాన్ని కలిగించవు. కాబట్టి సంతోషకరమైన, రుచికరమైన ఆహారానికి మధ్య తేడా గమనించినప్పుడు అవి రెండూ భిన్న స్వభావాలు కలిగి ఉంటాయి.
Read more: మనుషులు గడ్డి తింటే ఏమౌతుందో తెలుసా? తెరపైకి శాస్త్రీయ వాస్తవాలు!
నాగుపాముకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు.. 15 రోజులు బెడ్ పైనే..!