- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న వయసులోనే పెద్ద రెస్పాన్సిబిలిటీస్
దిశ, ఫీచర్స్ : సాధారణంగా కుటుంబంలో పెద్ద కూతురు తల్లి తర్వాత తల్లిగా, తండ్రి తర్వాత తండ్రిగా వ్యవహరిస్తుంది. అమ్మకు వంటింట్లో హెల్ప్ చేస్తూనే.. నాన్నకు ఆఫీస్‌కు సంబంధించిన వర్క్‌లోనూ సాయంగా ఉంటుంది. తోబుట్టువులకు అన్నీ తానై చూసుకుంటుంది. స్కూల్ బుక్స్ నుంచి డ్రెస్‌ల వరకు అన్నీ క్షణాల్లో ముందుంచుతుంది. చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలను మోస్తుంది. ఎమోషనల్ బర్డెన్‌ను అనుభవిస్తుంది. దీన్నే ‘ఎల్డర్ డాటర్ సిండ్రోమ్’ అని పిలుస్తుండగా.. అందులో తప్పేముందని అడిగేవారూ లేకపోలేరు. కానీ ఇది నిజంగా పెద్ద సమస్యే అంటున్నారు నిపుణులు. కౌమార దశలోనే వారు ఎదుర్కొంటున్న శ్రమ, ఒత్తిడి.. భవిష్యత్తులో మానసిక, శారీరక అనారోగ్యాన్ని దెబ్బతీస్తుందని.. జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
కారణమిదే..
వాస్తవానికి ‘ఎల్డర్ డాటర్ సిండ్రోమ్’ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. విద్య, ఉద్యోగాలలో మహిళలు ఎదుగుతున్నప్పటికీ.. ఇంటి పని విషయంలో అధిక భారాన్ని మోస్తున్నారు. అంటే ఆఫీసుల్లోని జెండర్ ఈక్వాలిటీ.. ఇంకా కుటుంబాలు, ఇంటి పనుల్లోకి రాలేదని అర్థం. అందుకే ప్రస్తుతం ఈ చర్చ అవసరం. కాగా తమకు తెలీకుండానే ఇంటికి పెద్ద కూతుళ్లు డొమెస్టిక్ లేబర్స్‌గా మార్చబడుతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది లింగ వివక్షతకు కూడా అద్దం పడుతోంది. ఐదు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సుగల బాలికలు.. బాలురకంటే 40శాతం ఎక్కువగా ఇంటి పనులు చేస్తున్నారు. పితృస్వామ్య వ్యవస్థ ఆర్డర్‌తో తోబుట్టువుల భారాన్ని మోస్తున్నారు. బాల్యాన్ని సంతోషంగా గడపకుండా వారి శ్రేయస్సును దెబ్బతీస్తున్న ఈ పద్ధతి.. ఇక తరం నుంచి మరో తరానికి లింగ అసమానతను వ్యాప్తిచేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
బిహేవియరల్ థియరీస్
ముఖ్యంగా బిహేవియరల్ థియరీస్ ఎల్డర్ డాటర్ సిండ్రోమ్‌కు కారణం అవుతున్నాయి. ఇందులో మొదటిది రోల్ మోడలింగ్ థియరీ. ఇది జెండర్‌ను డిసైడ్ చేసి, వారు ఏం చేయాలో చెప్తుంది. సహజంగానే తరతరాలుగా ఇది వస్తోంది. ఇందులో భాగంగా పెద్ద కుమార్తెలు తరచుగా తమ తల్లిని రోల్ మోడల్‌గా అనుసరిస్తారు. రెండవది.. సెక్స్-టైపింగ్ థియరీ.. తల్లిదండ్రులు తరచుగా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు విధులను కేటాయిస్తుంటారు. తరచుగా స్త్రీత్వంతో ముడిపడి ఉన్న ఇంటి పని గురించి తల్లిదండ్రులు ప్రస్తావిస్తుంటారు. వారి నుంచి పిల్లలు అనుసరిస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద కుమార్తెలు తెలియకుండానే వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం, షాపింగ్ చేయడం వంటి లింగపరమైన కార్యకలాపాలలో నిమగ్నమవుతుంటారు. ఇక మూడవది.. ఇంటి పనులు చేసుకోవడానికి తల్లులకు సమయం లేనప్పుడు తరచుగా పెద్ద కుమార్తెలు ప్రత్యామ్నాయాలుగా వ్యవహరిస్తారని లేబర్ సబ్‌స్టిట్యూషన్ థియరీ సూచిస్తుంది. పర్యవసానంగా ‘ఎల్డర్ డాటర్ సిండ్రోమ్’ కొనసాగుతూ ఉంటుంది.
ఉదాహరణకు.. ఫిలిప్పీన్స్‌లో చాలా మంది తల్లులు యూఎస్, మిడిల్ ఈస్ట్, యూరప్‌లకు డొమెస్టిక్ కార్మికులుగా పని చేసేందుకు వలస వెళ్తుంటారు. ఈ కారణంగా కూడా ఇక్కడి కుటుంబాల్లోని పెద్ద కుమార్తెలు ఇంటి బాధ్యతలు మోయాల్సి వస్తుంది.
పరిష్కారమేది?
పెద్ద కుమార్తెలపై పెరుగుతున్న ఇటువంటి భారాన్ని, పని ఒత్తిడిని నివారించడంలో కుటుంబాలు కీలకపాత్ర పోషించాలి. ఇంటి బాధ్యతలను పెద్ద కుమార్తెలపైనే మోపకుండా చూడాలి. కుటుంబంలోని మగవారు ఇంటి పనిలో సహకరించాలి. శతాబ్దాల తరబడి ఇంటి పని విషయంలో ఇవి అమ్మాయిలు లేదా స్త్రీలు మాత్రమే చేయాల్సినవి అంటూ ఆపాదించబడిన అపోహలను దూరం చేయగలగాలి. 2023 యూకే బడ్జెట్‌లో చైల్డ్ కేర్ కవరేజీ ఇన్వెస్ట్‌మెంట్‌ను 4 బిలియన్లకు విస్తరించడం కూడా కొంత ఊరటనిస్తున్న అంశం. కాగా వ్యక్తిగతంగాను, సామాజికంగాను లింగ అసమానతను తొలగించే పోరాటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Read more:
ఇంట్లో ఉమెన్ స్పెషల్ స్పాట్.. బాల్కనీతో మీ కనెక్షన్ ప్రత్యేకమే కదా..!!