కుక్క‌లు ఇలా కూడా చేస్తాయా..? ప‌సిపిల్లాడితో ఇంత ముద్దుగా.. (వీడియో)

by Sumithra |
కుక్క‌లు ఇలా కూడా చేస్తాయా..? ప‌సిపిల్లాడితో ఇంత ముద్దుగా.. (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇంత బిజీ జీవితాల‌ను గ‌డుపుతున్న స‌మాజంలో పెంపుడు జంతువుల‌కు స‌మ‌యం ఇస్తున్నారంటే, వాటి విలువ‌, మ‌నుషుల‌కు వాటిపై ఉన్న ప్రేమ‌, న‌మ్మ‌కం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ముఖ్యంగా పెంపుడు కుక్కలు చేసే ప‌నులు ఇంట‌ర్నెట్లో అత్యంత వ్యూవ్స్ దోచేస్తుంటాయి. అందులోనూ చిన్న చిన్న పిల్ల‌ల‌తో కుక్క‌ల సాంగ‌త్యం మ‌రింత మందికి నచ్చుతుంది. చాలా మంది త‌మ పిల్ల‌ల్ని పెంపుడు కుక్కలకు చాలా ద‌గ్గ‌రగానూ పెంచుతారు. ఇలాంటి వీడియోనే ఒక‌టి ఇన్‌స్టాగ్రామ్‌లో అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. చిన్న బిడ్డ‌తో కుక్క ఆడుకోవ‌డం, పిల్లాడికి ఆడుకో అంటూ చేయి చాచి, బొమ్మ‌ను అందించ‌డం చూస్తే, ఎవ్వ‌రికైనా ముచ్చ‌టెయ్య‌క మాన‌దు. కాలీ అనే గోల్డెన్ రిట్రీవర్ కుక్క శిశువు చేతిలో మెత్తటి బొమ్మను ఉంచుతుంటే బిడ్డ‌కు ఆడుకోవ‌డం నేర్పిస్తున్న‌ట్లు ఉంటుంది. ఈ వీడియో చూసిన‌ నెటిజ‌నులు ముచ్చ‌టేసి, తెగ‌ లైక్‌లు, షేర్లూ చేస్తున్నారు. మీరూ చూడండి..


Advertisement

Next Story