Viral : పార్సిల్‌తోపాటు ఓ లెటర్ వదిలి వెళ్లిన డెలివరీ బాయ్.. ముచ్చట పడి కోరిక తీర్చిన మహిళ!

by Javid Pasha |   ( Updated:2024-07-01 07:17:25.0  )
Viral : పార్సిల్‌తోపాటు ఓ లెటర్ వదిలి వెళ్లిన డెలివరీ బాయ్.. ముచ్చట పడి కోరిక తీర్చిన మహిళ!
X

దిశ, ఫీచర్స్ : ఆన్‌లైన్ పార్సిల్ అండ్ ఫుడ్ డెలివరీస్ సిస్టం అందుబాటులోకి వచ్చాక కస్టమర్లకు మరింత సౌకర్యం ఏర్పడింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఒక్క క్లిక్‌తో కోరుకున్నవన్నీ ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయ్. బిజీలైఫ్ షెడ్యూల్ కలిగిన సిటీ ప్రలజకు ఇది మరింత మేలు చేస్తోంది. అలాగే పలువురు యువతీ యువకులకు డెలివరీ ఏజెంట్లుగా ఉపాధి కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఎంతోమంది డెలివరీ బాయ్స్ లేదా గర్ల్స్‌గా వర్క్ చేస్తున్నారు. ఎండ, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలూ పనిచేసే డెలివరీ ఏజెంట్లు కూడా చాలామందే ఉంటారు. అలాంటి ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌కు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అతను చేసిన పనికి ఓ మహిళ ముచ్చటపడి మరీ అతని కోరిక తీర్చింది. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని ఫీనిక్స్‌కు చెందిన ఎరికా హెర్నాండెజ్ అనే ఓ మహిళ రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఓ వస్తువును ఆర్డర్ చేసింది. అయితే దానిని తీసుకొచ్చిన ఓ డెలివరీ ఏజెంట్ సదరు మహిళా కస్టమర్ ఇంటివద్ద పార్సిల్‌తోపాటు ఓ లెటర్ కూడా వదిలి వెళ్లాడు. తర్వాత పార్సిల్ రిసీవ్ చేసుకున్న ఆ మహిళ అందులోని లెటర్ చదివి ఆశ్చర్యపోయింది. డెలివరీ ఏజెంట్ చేసిన పనికి ముచ్చట పడి మరీ అతని కోరిక తీర్చింది. ఇంతకీ అందులో ఏముందంటే..

త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నానని, తన గర్ల్ ఫ్రెండ్‌కు మర్చిపోలేని జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్సిల్ డెలివరీ జాబ్ చేస్తూ డబ్బులు కూడ బెట్టుకుంటున్నానని డెలివరీ ఏజెంట్ ఆ లెటర్‌లో పేర్కొన్నాడు. తన ప్రియురాలి కోరిక మేరకు ఖర్చులకు వెనుకాడకుండా గ్రాండ్‌గా పెళ్లి జరుపుకోవాలన్నదే తన ఉద్దేశమని, మీకు తోచినంత టిప్ ఇవ్వాలని అందులో ప్రస్తావించాడు. ఇది చూసిన ఎరికా హెర్నాండెజ్ సంతోషంగా తనవంతుగా సాయం చేసింది. పైగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయిపోయింది. పలువురు నెటిజన్లు కూడా సదరు డెలివరీ ఏజెంట్‌కు డబ్బు సాయం చేయడంతోపాటు ‘నువ్వు గ్రేట్’ అంటూ పొగిడేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed