ప్రమాదాన్ని సూచిస్తున్న చర్మం, గోర్ల రంగు.. అదేలాగంటే?

by Kavitha |
ప్రమాదాన్ని సూచిస్తున్న చర్మం, గోర్ల రంగు.. అదేలాగంటే?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు రక్తహీనత తలెత్తుతుంది. రక్తహీనత వల్ల ఆక్సిజన్ తగినంత మొత్తంలో శరీరంలోని అన్ని భాగాలకు చేరకుండా శరీరంలో అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గితే గోర్లు, చర్మం పాలిపోయినట్లు, అలసట, బలహీనత, తలనొప్పి, శరీరం బరువు తగ్గడం, చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం, శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి, హార్ట్ బీట్ పెరగడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి.. అయితే ఇలా కాకుండా ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐరన్‌:

*శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే ఐరన్‌ అధికంగా ఉండే రెడ్ మీట్, చేపలు, చికెన్, పప్పులు, పచ్చి కూరగాయలు, గింజలు ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.

విటమిన్ సి:

*అదేవిధంగా ఐరన్‌తోపాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ సి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచడంలో సహాయపడుతుంది. ఇది ప్రధానంగా ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.

విటమిన్ B12 :

*అలాగే హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే విటమిన్ B12 ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ విటమిన్ రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుడ్లు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్‌లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

నీరు:

*శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు, బ్లడ్ కంసన్‌ట్రేషన్ తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ వల్ల రక్తహీనత సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి, వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి పుష్కలంగా నీరు తాగాలి.

ఎండు ద్రాక్ష:

*టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటికి బదులు ఎండు ద్రాక్ష రసాన్ని పానీయంగా తీసుకోవడం వల్ల రెండు వారాల్లో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

వ్యాయామం:

*అదే విధంగా వ్యాయామంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం వలన హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి శరీరంలోని ప్రతి పార్ట్‌కి కావల్సినంత ఆక్సిజన్ లభిస్తుంది. దీని వలన శారీరక బలహీనత నుంచి బయట పడతాము.

Advertisement

Next Story

Most Viewed