వంటింటి కన్నీటికి చెక్.. మార్కెట్‌లో టియర్‌లెస్ ఆనియన్

by Disha News Desk |
వంటింటి కన్నీటికి చెక్.. మార్కెట్‌లో టియర్‌లెస్ ఆనియన్
X

దిశ, ఫీచర్స్ : నిజ జీవితంలో కన్నీళ్లంటే తెలియనివాళ్లను సైతం ఉల్లిగడ్డలు ఏడిపించేస్తాయి. ఎందుకంటే కళ్లు తడవకుండా ఉల్లిపాయలు తరగడం అసాధ్యం కనుక. ఈ బాధలు భరించని కొందరు వంటింట్లో ఆనియన్స్‌ను బ్యాన్ చేసిన సందర్భాలూ లేకపోలేదు. లేదంటే వంటలో ఆ ఒక్క పని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే మార్కెట్‌లోకి కొత్తగా 'సునియన్స్' అందుబాటులోకి వస్తున్నాయి. తరిగినపుడు కన్నీళ్లు రాని ఆనియన్స్‌నే సునియన్స్‌గా పిలుస్తుండగా.. జర్మన్ కెమికల్ కంపెనీ BASF లో పనిచేసే ప్లాంట్ బ్రీడర్ 'రిక్ వాట్సన్' వీటిని తయారు చేశారు.

జెనెటిక్ మెథడ్స్‌ కాకుండా సహజ పద్ధతుల్లో సునియన్స్‌ తయారుచేసిన రిక్.. 1980 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. ఈ మేరకు తక్కువ గాఢతతో కన్నీళ్లు రానివ్వని సునియన్స్ తయారు చేసేందుకు అతనికి 30 ఏళ్లకు పైగా పట్టింది. కాగా సాధారణ ఉల్లిగడ్డ కంటే ఎక్కువ ధర కలిగిన 'సునియన్స్' ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్వీట్ అండ్ మైల్డ్ కాన్సంట్రేషన్ కలిగిన ఈ ఉల్లిగడ్డ పై సాధారణ జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story