- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందం అంటే ఏమిటి? మోస్ట్ బ్యూటిఫుల్ మహిళలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు?
దిశ, ఫీచర్స్ : అందం అంటే ఏమిటి? ఇది మీరు ఫీలయ్యే దానిని బట్టి ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. ఎందుకంటే ఒకరు అందంగా భావించే మనుషులు, దృష్యాలు, వస్తువులు మరొకరి దృష్టిలో అందమైనవి కాకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో అందాన్ని ఆస్వాదించడం, పరిగణించడం చేస్తుంటారు. ఆస్ట్రేలియాలో ప్రజలు నల్లగా ఉంటారు. అయినా అక్కడ నలుపు రంగే అందం. ఇలా ఆయా దేశాలు, భౌగోళిక పరిస్థితులు, భావజాలాలు, స్థానిక పరిస్థితులను బట్టి కూడా అందం ముడిపడి ఉంటుంది.
ఇదంతా ఒక ఎత్తైతే కొన్నిసార్లు ఆయా సంస్థలు, ఏజెన్సీలు కూడా ప్రజల వ్యక్తిగత విషయాలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వారి అభిప్రాయాలు వంటి విషయాలపై సర్వే నిర్వహిస్తుంటాయి. అలాగే ఒక యూరోపియన్ ఏజెన్సీ ఇటీవల ప్రపంచంలో అందమైన మహిళలు ఏ దేశంలో ఉన్నారు? అనే అంశంపై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ప్రపంచంలో కెల్లా మోస్ట్ బ్యూటిఫుల్ మహిళలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో వరుసగా స్వీడన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో ఉక్రెయిన్ ఉంది. ఆ తర్వాత టర్కీ, రష్యా, పోలాండ్, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, మధ్య ఐరోపా దేశాలు ఉన్నాయి. అయితే మహిళల అందాన్ని పరిగణించే విషయంలో సర్వే నిపుణులు వారి స్కిన్ అండ్ ఐ కలర్స్‌తో పాటు క్రమ శిక్షణ, డిగ్నిటీ వంటి అంశాలను ఎనలైజ్ చేశారట. ఎందుకో కానీ ఈ జాబితాలో భారత దేశానికి సంబంధించిన ప్రస్తావన లేదు. కేవలం యూరోపియన్ దేశాల వరకే సర్వేను పరిమితం చేశారు.