- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూర్యుడు ఏ కలర్‌లో ఉంటాడు? .. వాస్తవానికి గ్రీన్ కలర్ అని మీకు తెలుసా?
దిశ, ఫీచర్స్ : సూర్యుడు వాస్తవానికి ఏ కలర్‌లో ఉంటాడు? తెలుపా.. ఎరుపా? అనే ఒక ఇంట్రెస్ట్ డిబేట్ ట్విట్టర్ వేదికగా జరుగుతుండటం అందరినీ ఆకర్షించింది. దీనికి కారణం ప్రముఖ రైటర్ జాక్వి డీవోయ్ (Jacqui Deevoy). ఆయన ఇటీవల తాను చిన్నప్పుడు సూర్యుడు ఎల్లో కలర్‌లో ఉండేవాడని ప్రస్తుతం వైట్ కలర్‌లోకి చేంజ్ అయ్యాడని ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కొన్ని రోజుల్లోనే ఇది ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. యూజర్స్‌ను రెండు వర్గాలుగా విడదీసింది. ఇందులో సూర్యుడు ఎల్లప్పుడూ తెల్లగా ఉంటాడని నమ్మేవారు ఒక గ్రూపుగా, ఎల్లో కలర్‌లో సూర్యుడు ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నాడని అంగీకరించిన వారు మరో గ్రూపుగా ఉన్నారు. దీంతో మన సౌర వ్యవస్థలో నక్షత్రం రంగుపై ఇంట్రెస్టింగ్ డిబేట్ మొదలైంది.
వాస్తవానికి సూర్యుడి కలర్ ఏది?
సైంటిస్టుల ప్రకారం.. సూర్యుడు ఒక నక్షత్రం. నిజానికి గ్రీన్ కలర్‌లో ఉంటాడట. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ డబ్ల్యు డీన్ పెస్నెల్ ‘మీ కన్ను దానిని చూడగలిగితే సూర్యుడు ఆకుపచ్చగా కనిపిస్తాడు’ అని పేర్కొన్నాడు. ‘బేసికల్లీ మీరు సూర్యుడిని చూసినప్పుడు అందులో విభిన్న రంగులు ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరి కళ్లు సూర్యుడి వెలుతురులో క్రేజీ ఫైరింగ్ అనుభూతిని పొందుతాయి. అంటే ఈ మండుతున్న నక్షత్రం ఏ రంగులో ఉందో మీకు చెప్పలేనంత ప్రకాశవంతంగా ఉంటుంది’’ అన్నాడు. భూమికి 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ఈ నక్షత్రం సాధారణంగా ఆకాశంలో తెల్లటి మచ్చలా కనిపిస్తుందని తెలిపాడు. అయితే దాని వెలుతురు చెల్లాచెదురుగా ఉన్నందున ఇది పసుపు రంగులో ఉందని చాలా మంది నమ్ముతుంటారని చెప్పాడు.
గాలిలో ఉన్న అణువులు సూర్యకాంతి యొక్క బ్లూ, వాయిలెట్ తరంగదైర్ఘ్యాలను దారి మళ్లిస్తాయి. ఈ పరిస్థితి రెడ్ అండ్ ఎల్లో తరంగదైర్ఘ్యాలు ఉద్భవించడానికి కారణం అవుతుంది. సూర్యుడిని చూసినప్పుడు ఇవే మన కళ్లపై ఎఫెక్ట్ చూపుతాయి. పైగా ప్రకాశవంతమైన కాంతిని కూడా కలిగి ఉన్నందున కొన్ని సందర్భాల్లో సూర్యుడు మనకు తెల్లగా లేదా పసుపు రంగుల్లో దర్శనమిస్తుంటాడు. కానీ వాస్తవానికి సూర్యుడు ఆకుపచ్చ నక్షత్రం. వాతావరణ మార్పులను బట్టి మనకు పసుపు, నారింజ లేదా ఎరుపు రంగులో కూడా కనిపిస్తూ ఉంటాడు. సూర్యుని రంగుగా మనం గ్రహించేది నిజంగా తేలికైన ఉపరితలం నుంచి బౌన్స్ అవుతుంది. నక్షత్రాల విషయానికి వస్తే, రంగు ఉష్ణోగ్రతకు సమానమని నిపుణులు అంటున్నారు. నక్షత్రం వేడెక్కినప్పుడు నీలిరంగు కాంతిని ప్రసరిస్తుంటాడు. అలాగే కూల్‌గా ఉన్నప్పుడు (మార్నింగ్) రెడ్ కలర్‌లో కనిపిస్తాడని సైంటిస్ట్ డీన్ పెస్నెల్ అన్నాడు.
Also Read..
ఔషధ సమ్మేళనాల గని సముద్రపు పాచి.. ఆధునిక వైద్యంలో విప్లవాత్మక మార్పునకు దోహదం!