Summer : సమ్మర్ స్టార్ట్ అయిపోయింది .. ఈ కూరగాయను అధికంగా తీసుకోవాలంటున్న నిపుణులు

by Prasanna |
Summer : సమ్మర్ స్టార్ట్ అయిపోయింది .. ఈ కూరగాయను అధికంగా తీసుకోవాలంటున్న నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : కీరదోసకాయను ఉపయోగించి మనం ఎన్నో రకాల ఫుడ్స్ ను తయారు చేసుకుంటాము. వీటితో ఎక్కువగా సలాడ్స్ వంటివి చేస్తుంటాము. దీనిలో విటమిన్ సి, మెగ్నీషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, కంటెంట్, మినరల్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. అయితే, ప్రతి రోజూ తీసుకోవడం వలన మన శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన పొట్ట శుభ్రపడుతుంది. కీరదోస కాయ ఒకటే కాకుండా క్యారెట్, ఆపిల్స్ వంటి వాటితో కలిపి సలాడ్ చేసుకుని తింటే రుచి కరంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కీరదోస కిడ్నీలను మంచిగా ఉంచుతుంది. ఎందుకంటే, దీనిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్ ను సులభంగా కరిగించేందుకు సహాయపడతాయి. బ్లడ్ ప్రెషర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఇది బాగా సహాయ పడుతుంది. అంతే కాదు, హైబీపీ, లోబీపీ కూడా కంట్రోల్ చేస్తుంది.

కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది. వేసవి కాలంలో దీనిని తీసుకుంటే, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. తలనొప్పితో బాధ పడేవారు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వలన తల నొప్పి తగ్గుతుంది. కళ్ళ కింద నల్లని మచ్చలు , వలయాలు తొలగి పోవాలంటే వీటిని ముక్కల్లాగా కోసుకుని కళ్ళ కింద పెట్టుకుంటే కొద్దీ రోజులకే తగ్గిపోతాయి. దంత, చిగుళ్ళ వంటి సమస్యలు ఉన్న వారు కీరదోసకాయ జ్యూస్ తీసుకుంటే ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story