- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వృద్ధాప్యాన్ని రివర్స్ చేయవచ్చు.. ఫాస్ట్ ఫార్వార్డ్‌గానూ మలచొచ్చు..
దిశ, ఫీచర్స్: యాంటీ ఏజింగ్‌లో సంచలనాత్మక పురోగతిని సాధించారు శాస్త్రవేత్తలు. 'సెల్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో.. కణాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే లేదా రివర్స్ చేయగల 'వృద్ధాప్య గడియారం (ఏజింగ్ క్లాక్)' గురించి వివరించారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై ఇటీవల ప్రయోగాలు వృద్ధాప్యం అనేది రివర్సిబుల్ ప్రక్రియ అని.. మనకు నచ్చినట్లుగా వయసును ముందుకు, వెనుకకు అడ్జస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. మానవ శరీరాలు యూత్‌కు సంబంధించిన ఒక రకమైన బ్యాకప్ కాపీని కలిగి ఉంటుందని, ఇది పునరుత్పత్తికి ప్రేరేపించబడుతుందని కనుగొన్నారు.
నిజానికి వృద్ధాప్యం అనేది డీఎన్ఏను బలహీనపరిచే జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా లేదా దెబ్బతిన్న కణాలు కాలక్రమేణా శరీరాన్ని క్షీణింపజేస్తాయనే నమ్మకం ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుత ప్రయోగ ఫలితాలు ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తున్నాయి. 'ఇది లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మేము నమ్ముతున్నాం. సెల్ దాని అసలు డీఎన్ఏను రీడ్ చేసే సామర్థ్యం కోల్పోవడం వలన అది ఎలా పని చేయాలో మర్చిపోతుంది. అదే విధంగా పాత కంప్యూటర్ పాడైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తుంది. మేము దాన్ని 'ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ ఏజింగ్'గా పిలుస్తున్నాం' అని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఒకరి సౌలభ్యం మేరకు ఆన్ లేదా ఆఫ్ చేసే విధానాన్ని కనుగొనవలసి ఉంది.
కాగా ప్రయోగం సమయంలో ఎలుకలలో వృద్ధాప్యం నియంత్రించబడింది. ఎటువంటి ఉత్పరివర్తనలు కలిగించకుండా ఎలుకలలో వృద్ధాప్యాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలిగారు. గుడ్డి ఎలుకల దెబ్బతిన్న కళ్లలోకి ఇంజెక్ట్ చేయబడిన మానవ వయోజన చర్మ కణాల కాక్టెయిల్.. వాటికి కంటి చూపును తిరిగి ప్రసాదించగలిగింది.