- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MRI SCAN : ఫుల్ బాడీ చెకప్స్ అవసరమా? ఎందుకు?
దిశ, ఫీచర్స్ : ఫుల్ బాడీ చెకప్స్ నిజంగా లైఫ్ సేవ్ చేస్తాయా? సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు.. ఫ్యాన్స్ ను చేయించుకోవాలని కోరుతున్నారు. బాడీలో దాగి ఉన్న రోగాలను ముందే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా ఇదే పనిలో ఉంటున్నాయి. ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. కానీ ఇది నిజంగా అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందా? తాజా అధ్యయనం చెప్తున్నదేంటి? తెలుసుకుందాం.
లాంకాస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆడమ్ టేలర్ నేతృత్వంలోని తాజా అధ్యయనం.. MRI స్కాన్‌లు చాలా నివారించగల వ్యాధులను గుర్తించలేవని తెలిపింది. నిజానికి గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, హై బీపీ, మధుమేహం కారణంగా ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ స్కాన్‌లు ఈ దీర్ఘకాలిక పరిస్థితులను గుర్తించలేవు. కొన్ని నిర్మాణాత్మక మార్పులను కనుగొన్నా.. చాలా లక్షణాలను సూచించలేవు.
MRI స్కాన్స్ తరుచుగా ఇతర లక్షణాలను గుర్తించేందుకు తీసుకునేటప్పుడు.. అనుకోకుండా కొన్ని వ్యాధులు గుర్తించబడుతాయి. వీటిని ఇన్సిడెంటలోమాస్ అంటారు. 16000 మందిపై చేసిన అధ్యయనం MRI స్కాన్స్ ఇలాంటివి గుర్తిస్తాయని తెలిపింది. సీరియస్ ఫైండింగ్స్ విషయానికి వస్తే.. ఇవి బ్రెయిన్ 1.4%, చెస్ట్ 1.3%, అబ్డోమెన్ 1.9%గా ఉన్నాయి. ఇక ఈ టోటల్ బాడీ చెకప్ చాలా సార్లు పాజిటివ్ గా నిర్ధారించినా.. ఆ వ్యాధులు ఉండకపోవచ్చని తెలిపింది. బ్రెస్ట్ కండిషన్స్ లో వెయ్యికి 97, ప్రొస్టేట్ లో 100కు 29 ఫాల్స్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఇక MRI ఫుల్ బాడీ స్కాన్స్ చర్మం కింద ఏం జరుగుతుందో కనిపెట్టేందుకు మాత్రమేనని.. అనవసరంగా మనీ వేస్ట్ అని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఫాల్స్ పాజిటివ్స్ తో ఈ పరిస్థితి మరింత అధికమని.. ఒకవేళ పాజిటివ్ చూపిస్తే అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మరిన్ని సిరీస్ ఆఫ్ టెస్టులు చేయాల్సి వస్తుందన్నారు శాస్త్రవేత్తలు.