ఒత్తిడిని పెంచే ఆహారాలు ఇవే.. తీసుకోకపోవడమే బెటర్!

by Javid Pasha |   ( Updated:2024-10-20 13:42:13.0  )
ఒత్తిడిని పెంచే ఆహారాలు ఇవే.. తీసుకోకపోవడమే బెటర్!
X

దిశ, ఫీచర్స్ : ఆహారాల్లో ఆరోగ్యానికి మేలు చేసే గుణమే కాదు, అధికంగా తీసుకుంటే అనారోగ్యాలకు, మానసిక ఒత్తిడికి గురిచేసే లక్షణం కూడా కొన్నింటిలో ఉంటుంది. కాబట్టి తరచుగా స్ట్రెస్ రిలేటేడ్ ఇష్యూస్ ఉన్నవారు కొన్ని రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే..

ఒత్తిడి అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆందోళనకు గురికావడం. సాధారణంగా ప్రతికూల ఆలోచన, బాధాకరమైన సంఘటన వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్నిరకాల ఆహారాలు కూడా ఒత్తిడికి గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ సందర్భంలో నిరాశ, నిస్పృహ, కోపం, ఆత్రుత వంటి భావాలు అధికం అవుతాయి. ఒత్తిడి స్థాయిని బట్టి తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

స్ట్రెస్ రిలేటెడ్ ఆహారాలు, పానీయాల విషయానికి వస్తే మద్యం, జంక్ ఫుడ్స్, స్వీటెనర్లు, టీ, కాఫీ వంటివి ప్రధానంగా ఉంటున్నాయి. మద్యం లేదా ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో సహజంగానే ఒత్తిడి, చిరాకు వంటివి కనిపిస్తాయి. ఇక ఫాస్ట్ లేదా జంక్ ఫుడ్స్ కూడా వాటిలోని పదార్థాలు, రసాయనాలు రక్తనాళాలపై ప్రతిూల ప్రభావం చూపడంతో ఆందోళన, ఒత్తిడి వంటి భావాలకు దారితీస్తాయి. కృత్రిమ చక్కెరలు లేదా స్వీటెనర్స్ ఎక్కువగా తీసుకోవడం రక్తపోటును, మధుమేహాన్ని మరింత పెంచుతాయి. దీంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది. కాఫీ రెండు మూడు కప్పులు తాగితే మేలు చేస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం అందులోని కెఫిన్ నిద్రలేమి, ఒత్తిడి, ఆందోలన వంటి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story