- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Heart Health : గుండెకు ఒత్తిడి ముప్పు.. బయటపడే మార్గమిదే..

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. GOQii ఇండియా ఫిట్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఏటా 24 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజువారీ పని విధానం, ఆర్థిక పరమైన సమస్యలే ఇందుకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. స్ట్రెస్ సహజమే అయినప్పటికీ దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం ఉపయోగపడే కొన్ని టెక్సిక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్వీయ సంరక్షణ
చాలా మంది పని ఒత్తిడి, వివిధ సమస్యలతో సఫర్ అయ్యే క్రమంలో తమను తాము నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ పరిస్థతి క్రమంగా మానసిక, శారీరక అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అధిక ఒత్తిడి గుండెపై ప్రభావం చూపడంవల్ల బ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు వంటివి డెవలప్ కావడానికి కూడా దారితీస్తుంది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా.. స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలరని గుర్తుంచుకోండి.
ఫిజికల్ యాక్టివిటీస్
ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడంలో ఫిజికల్ యాక్టివిటీస్ అద్భుతంగా పనిచేస్తాయి. సో.. డైలీ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవన్నీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. నిజానికి ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అయి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. రోజూ వ్యాయామాలు చేయడంవల్ల దీనికి చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ మెదడులో ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపించడంవల్ల మీలో ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తాయి. అందుకే వ్యాయామాలకు సమయం కేటాయించండి. కనీసం రోజూ 150 నిమిషాలైనా ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలంటున్నారు నిపుణులు.
సమతుల్య ఆహారం
గుండెపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడంలో సమతుల్య ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ రోజువారీ డైట్‌లో తాజా కూరగాయలు, పాలు, పండ్లు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్స్ వంటివి ఉండేలా చూసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, హై షుగరింగ్ స్నాక్స్ వంటివి తీసుకోవడం మానుకోవాలి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రిలాక్స్‌గా ఉండండి
మనసు ప్రశాంతంగా ఉంటే చాలా వరకు అనారోగ్యాలు దూరం అవుతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే మైండ్ ఫుల్ నెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, మెడిటేషన్, యోగా, ఇతర వ్యాయామాలు ఇందుకు దోహదం చేస్తాయి.
ఫ్యామిలీతో గడపండి
కుటుంబ సభ్యులతో మాట్లాడటంవల్ల మీలోని ఒత్తిడి చాలా వరకు దూరం అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఫ్యామిలీ మెంబర్స్‌తో, మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా సానుభూతి, ఎమోషనల్ సపోర్ట్ లభించడంవల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. వీటన్నింటితో పాటు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే పరిస్థితులను నివారించడానికి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం మర్చిపోవద్దు అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.