Gallbladder Diet : గాల్ బ్లాడర్ స్టోన్స్‌ ఉంటే గనుక.. ఇవి తినొద్దు !

by Harish |   ( Updated:2023-01-04 12:41:09.0  )
Gallbladder Diet : గాల్ బ్లాడర్ స్టోన్స్‌ ఉంటే గనుక.. ఇవి తినొద్దు !
X

దిశ, ఫీచర్స్: మానవ శరీర అవయవాల్లో ఎంతో ముఖ్యమైనది గాల్ బ్లాడర్. దీని పనితీరు వల్లే తీసుకునే ఆహారం జీర్ణం అవుతుంది. కాలేయం కింది భాగంలో ఉండే ఈ చిన్న అవయవాన్ని గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అని పిలుస్తారు. ముఖ్యంగా ఇది పైత్యరసాన్ని నిల్వ చేసుకుని జీర్ణ క్రియకు అవసరం మేరకు అందిస్తూ ఉంటుంది. అంటే చిన్న ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వాస్తవానికి గాల్‌ బ్లాడర్ అనేది ఒక సున్నితమైన అవయవం. జీవన శైలి మార్పుల కారణంగా ఇది ప్రభావితం అవుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల దీనికి మేలు జరుగుతుంది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధ పడుతుండటం క్రమంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

శరీరంలో తలెత్తే ఇబ్బంది, లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదించినప్పుడు అవసరమైన టెస్టుల ద్వారా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్న సంగతి బయట పడుతుంది. అయితే ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు అవేమిటో చూద్దాం.

1. మిల్క్ ప్రొడక్ట్స్: పాలతో తయారు చేసే వివిధ ఉత్పత్తులు, స్వీట్లు ఆరోగ్యానికి మంచివిగా చెప్తుంటారు. కానీ గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో స్టోన్స్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, హెవీ క్రీం ఉన్న పదార్థాలను తీసుకోవద్దు.


2. వేపుడు పదార్థాలు: ఫ్రై చేసిన పదార్థాలు, వేపుడు ఆహార పదార్థాలు, ముఖ్యంగా పొటాటో చిప్స్ వంటివి మినహాయించాలి. ఎందుకంటే ఇవి పిత్తాశయంలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని మరింత పెరిగేలా చేస్తాయి.


3. ఇటీవల ప్యాకేజ్డ్ ఫుడ్ ట్రెండ్ విస్తరిస్తోంది. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వాటిని తీసుకోవద్దు.


4. రెడ్ మీట్‌‌: ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో ఇబ్బందిపడేవారు దీనిని తినకూడదని నిపుణులు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఆహారంలో ఫైబర్‌ తక్కువగా ఉండటం కారణంగా గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రాసెస్ చేయబడిన ఫైబర్ రహిత ఆహార పదార్థాలు మితిమీరి తీసుకోకూడదు. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత డాక్టర్ సూచన మేరకు దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.



Advertisement

Next Story

Most Viewed