స్త్రీలు పురుషులుగా.. పురుషులు స్త్రీలుగా ఎప్పుడవుతారో తెలుసా ?

by S Gopi |   ( Updated:2023-03-26 06:04:22.0  )
స్త్రీలు పురుషులుగా.. పురుషులు స్త్రీలుగా ఎప్పుడవుతారో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడోసారి హోప్ లేని సందర్భం ఖచ్చితంగా ఎదురవుతది. అప్పుడు బ్రతుకు తాలూకు ఆశ చనిపోతది. అప్పుడు ఆశయాలు, భయాలు ఎంతో బలంగా ఢీకొంటాయి. అయితే, అలాంటి సమయంలోనే బాధను సైతం ఎంతో ఆనందంగా అనుభవిస్తూ.. రేపటి కోసం ఆశతో ఎదురుచూస్తూ బ్రతుకు తాలూకు పరిమళాన్ని పోగు చేసుకోవాల్సి ఉంటది.

అయితే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో జీవిత పర్యావసానాల వెల్లువలో కొట్టుకుపోవాల్సిందే. అలాంటి సమయంలో మనకు మనమే ఒక గడ్డి పోచగా కనిపించొచ్చు... పరాజయం పాలై గుండె పగలొచ్చు... ఆ సమయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంటాం.. అయితే, ఇలాంటి సమయంలోనే మనకు మనమే విధిని రాసుకోవాలి. ఆ టైంలోనే బాధపడి, తిరగబడి ముందుకెళ్లేవాళ్లే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మనకు బాధ కలిగించే విషయాల్లో మనం బాధపడాలి.. పశ్చాత్తాపం పడాలి. కానీ, అందులోనే మునిగిపోకూడదు. ఇందులో మనం గమనిస్తే ముఖ్యంగా ఆత్మగౌరం, కష్టాలకు తలవంచని పొగరు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ ఒక్కటైనా మనం ఫాలో అయినా జీవితంలో చేసే తిరుగుబాటుకు తిరుగుండదు... ఖచ్చితంగా విజయం సాధిస్తాం.

భరించలేని కష్టాల సమయంలో పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులవుతారని అంటుంటారు. ఎందుకంటే, సాధారణంగా ఆడవాళ్లు చాలా సెన్సిటీవ్. ఇంకొందరైతే చెప్పలేనంత సెన్సిటీవ్ గా ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే, ఇంతలా సెన్సిటీవ్ గా ఉండే స్త్రీలు.. కష్టకాలంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా తయారవుతారంటా. స్త్రీలు రూ. కోట్లలో సుకుమారంగా బ్రతకగలరని, అదేవిధంగా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చెరగని ఆత్మస్థైర్యంతో రేపటి మీద ఒక ఆశతో బ్రతుకుతారంటా. అందుకే పై విధంగా అంటారు. అంటే దీని అర్థం కష్టకాలంలో బాధపడకుండా ధైర్యంగా ఉంటూ విజయం వైపు ఆలోచించాలని.

Advertisement

Next Story