మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే మార్నింగ్ హాబిట్స్.. ఎలా వర్క్ చేస్తాయంటే..

by Javid Pasha |
మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే మార్నింగ్ హాబిట్స్.. ఎలా వర్క్ చేస్తాయంటే..
X

దిశ, ఫీచర్స్ : మనం ఏ పనిచేయాలన్నా అంతకు ముందు యాక్టివ్‌నెస్ చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. మానసిక సంసిద్ధత లేనప్పుడు ఏ వర్క్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఇది ముఖంలో బయటకు కనిపించే చిరునవ్వు లేదా ప్రవర్తన మాత్రమే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి యాక్టివ్‌నెస్ అంతర్గ మానసిక ధోరణికి సంబంధించినది కూడాను. రోజువారీ అలవాట్ల ద్వారా కూడా ఇది ప్రభావితం అవుతుంది. అందుకే మనల్ని యాక్టివ్‌గా ఉంచుతూ.. సక్సెస్ వైపు నడిపించే కొన్ని మార్నింగ్ హాబిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్నే నిద్రలేవడం

జీవితంలో మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచగలిగే అలవాట్లలో ఒకటి సూర్యోదయానికి ముందు నిద్రలేవడం అంటున్నారు నిపుణులు. అలాగని నైట్ షిఫ్టులు చేసేవారు కూడా పొద్దున్న లేవాలని కాదు, కానీ సాధారణ ప్రకృతి నియమంగా రాత్రి పూట త్వరగా నిద్రపోయేవారు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తే శారీరక జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. దీంతో యాక్టివ్‌‌నెస్ పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. పీస్‌ఫుల్ మైండ్‌తో వర్క్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మెరుగుదల కనిపిస్తుంది.

తగినంత నీళ్లు తాగడం

మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచే మరో గుడ్ హాబిట్ ఏంటంటే.. రాత్రి నిద్ర తర్వాత మీ బాడీని రీ-హైడ్రేట్ చేయాలి. అందుకోసం నిద్ర లేచిన వెంటనే కనీసం రెండు గ్లాసుల నీటిని తాగాలి. ఇది మీ జీవక్రియను కిక్‌స్టార్ట్ చేయడంలో సహాయపడుతుంది. డల్‌నెస్‌ను పోగొట్టి ఫిజికల్ యాక్టివిటీస్‌కు బూస్టింగ్‌లా పనిచేస్తుంది.

మెడిటేషన్

ఉదయంపూట మెడిటేషన్, యోగా వంటివి మీలోని ఒత్తిడిని తగ్గించి యాక్టివ్‌నెస్‌ను పెంచుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. తరచూ ఆందోళన చెందే అలవాటు దూరమైపోతుంది. కాబట్టి దీనిని అనుసరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామాలు

రోజంతా ఉత్సాహంగా ఉండటానికే కాదు, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటంలోనూ వ్యాయామాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదయంపూట వాకింగ్, రన్నింగ్, అదర్ వర్కవుట్స్ వంటివి చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. శారీరక, మానసి ఆరోగ్యాలకు వ్యాయామం చాలా ముఖ్యం. దీనివల్ల మీలో యాక్టివ్ నెస్ పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మిమ్మల్ని ప్రేరేపిస్తూ సక్సెస్ వైపు నడిపిస్తుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story