స్లీప్ ట్రాకర్స్.. మైగ్రేన్‌ ఎప్పుడు వస్తుందో చెప్పేస్తున్న యాప్స్

by Javid Pasha |   ( Updated:2024-01-26 15:24:23.0  )
స్లీప్ ట్రాకర్స్.. మైగ్రేన్‌ ఎప్పుడు వస్తుందో చెప్పేస్తున్న యాప్స్
X

దిశ, ఫీచర్స్ : మైగ్రేన్ లేదా పార్శ్వపు నొప్పి ఎప్పుడొస్తుందో అంచనా వేయడం కష్టం. కానీ చాలా బాధిస్తుంది. ఇది సాధారణ తలనొప్పికంటే చాలా తీవ్రమైన సమస్య. తలలో ఒకవైపు నొప్పిగా అనిపించడం, కళ్లు తిరగడం, కొందరికి వాంతులు అవడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే కచ్చితంగా ఎప్పుడు మొదలై ఎప్పుడు తగ్గుతుందో ఊహించలేం. కాకపోతే స్మార్ట్ వాచ్‌లలో ఉండే కొన్ని యాప్స్ ద్వారా వాటిని ధరించేవారిలోని స్లీప్ క్వాలిటీ, ఎనర్జీ, ఎమోషన్స్, ఒత్తిడిని ట్రాక్ చేయడం ద్వారా మరుసటిరోజు మైగ్రేన్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయవచ్చునని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా ‘పూర్ స్లీప్ నైట్’ కారణంగా నెక్ట్స్ డే మైగ్రేన్ వచ్చే చాన్సెస్ అధికంగా ఉంటాయి.

నాణ్యతలేని నిద్ర, అలాగే మునుపటి రోజు రాత్రి నిద్రలేకపోవడం అనే పరిస్థితి మరుసటి రోజు ఉదయం పార్శ్వపు నొప్పిని ఎలా పెంచుతుందో తెలుసుకోవడానికి బెథెస్డాలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌‌’కు చెందిన పరిశోధకుడు కాథ్లీన్ ఆర్. మెరికంగాస్ ఆధ్వర్యంలోని రీసెర్చర్స్ స్టడీ చేశారు. వివిధ వయస్సుల వారీగా మొత్తం 477 మంది స్లీప్ ట్రాకర్స్ ధరించినప్పుడు, ధరించని రోజుల్లో వారిని పరిశీలించారు. వీరిలో 291 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే స్లీప్ ట్రాకర్ మొబైల్ లేదా స్మార్ట్ వాచ్ యాప్ ఉపయోగించిన వారిలో మానసిక స్థితి, ఎనర్జీ, స్ట్రెస్, తలనొప్పిని రోజుకు నాలుగు సార్లు రేట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరి నిద్ర నాణ్యతను రోజుకు ఒకసారి రేట్ చేశారు. నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కాగా స్లీప్ ట్రాకర్స్ (యాప్స్ కలిగిన స్మార్ట్ వాచ్) ధరించిన వారికి సంబంధించిన యాప్ రీడింగ్స్ ఆధారంగా పరిశోధకులు పూర్ స్లీప్ క్వాలిటీ, ముందురోజు నిద్రలేని పరిస్థితుల కారణంగా మరుసటి రోజు మైగ్రేన్ వచ్చే అవకాశాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story